తొలి సినిమాతోనే సంచలన విజయం సాధించిన మెగా హీరో వైష్టవ్ తేజ్. ఇలా మొదటి సినిమాతో తమ కెరీర్ కు బంగారు బాటను వేసుకున్నాడు హీరోలు సినీ పరిశ్రమలో చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా తన మొదటి సినిమా ‘ఉప్పెన’తో ఓ రేంజిలో అభిమానులను సొంతం చేసుకున్నాడు ఈ మెగా హీరో. అయితే ప్రస్తుతం అతడు నటిస్తున్న తాజా ఆసక్తికర చిత్రం ‘కొండ పొలం’.
తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా సంచలన దర్శకుడు క్రిష్ ఆధ్వర్యంలో తెరకెక్కుతోంది. కొండపొలం అనేది ఒక నవల. ఈ నవల ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనిలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమాలో రకుల్ క్యారెక్టర్ రివీల్ చేస్తూ ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్, వీడియో షేర్ చేశారు మేకర్స్.
నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది.. కానీ.. కరోనా వ్యాప్తి కారణంగా సినిమా విడుదల వాయిదాపడుతూ వస్తోంది.‘కొండ పొలం’ సినిమా ట్రైలర్‌ను వచ్చే సోమవారం అంటే సెప్టెంబర్ 27న సాయంత్రం విడుదల చేస్తామంటూ దర్శకుడు క్రిష్ పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశాడు క్రిష్. అడవి నేపథ్యంలో పూర్తి అడ్వెంచర్స్ చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు.
అయితే ఇక్కడ ఓ విషయం ఏంటంటే.. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన రిలీజ్ కంటే ముందే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందట. ఈ సినిమాను కేవలం రెండునెలల్లోనే పూర్తి చేశారట. ఇక ఈ సినిమాను అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓబులమ్మ అనే సాంగ్ విడుదల చేసిన తెలిసిందే.
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…
ఇతిహాసాలలో ధర్మం, మానవత్వం గురించి చెప్పే గొప్ప ఉదాహరణల్లో ఒకటి రామాయణ యుద్ధం చివర్లో జరిగిన సంఘటనగా పండితులు పేర్కొంటారు.…
ఆంధ్రప్రదేశ్‌లోని పుణ్యక్షేత్రాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కుండలేశ్వర స్వామి క్షేత్రం భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తోంది. పవిత్ర గోదావరి…
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కొత్త విషయం కాదు. అయితే కొంతమంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పటికప్పుడు…
ఆయుర్వేద ఔషధాల్లో ప్రముఖ స్థానం ఉన్న అశ్వగంధపై కేంద్ర సంస్థలు కీలక నిర్ణయం తీసుకోవడం ఆరోగ్య రంగంలో చర్చనీయాంశంగా మారింది.…
ప్రస్తుతం జీవనశైలిలో వచ్చిన మార్పులు, అసమతుల్య ఆహారం, ఒత్తిడి కారణంగా థైరాయిడ్ సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య…