Categories: FeaturedMovie News

బిగ్ బాస్ నుంచి బిగ్ అప్ డేట్.. మూడో వారం ‘లహరి’ ఎలిమినేట్..!

బిగ్‌బాస్‌ సీజన్ 5 లో ఇప్పటికే ఇద్దరు బయటకు వెళ్లారు. ఇక అందులో మిగిలింది 17 మంది. అందులో కూడా ఒకరు బయటకు వెళ్లడానికి సమయం దగ్గర పడింది. ఇప్పటికే ఆ కంటెస్టెంట్ ను బయటకు పంపించారు. కానీ రేపు ప్రేక్షకులకు ఎవరనేది తెలవనుంది. కానీ లీకుల రాజాలు ఎవరు ఎలిమినేట్ అయ్యారో చెప్పేశారు. ఎక్కువ శాతం ఈ వారం ప్రియాంక బయటకు వెళ్తుంది అనుకున్నారు..

కానీ లహరి (అమ్ము) బయటకు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వారం శ్రీరామచంద్ర, మానస్‌, ప్రియ, ప్రియాంక, లహరి నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఎక్కువగా శ్రీరామ్‌, మానస్‌ భారీ ఓట్లతో ఓటింగ్‌లో ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. వీరి తర్వాత ప్రియాంక కూడా మంచి ఓట్లే సంపాదించుకున్నట్లు సమాచారం. అయితే మిగిలింది ప్రియా మరియు లహరి.

చివరకు వీళ్లిద్దరిలో ప్రియా సేఫ్ లోకి వెళ్లిపోయి.. లహరి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఏం జరిగిందటే.. ఎలిమినేషన్ రోజు ప్రియాపై ఎక్కువగా నెగెటివిటీ వచ్చేసింది. కానీ ఇక్కడ రవి.. కారణంగా లహరి బయటకు వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే.. రవి.. ఇంట్లో పెళ్లికాని వాళ్లు ఉన్నప్పటికీ ఆమె నా వెంట పడుతుంది అంటూ ప్రియతో లహరి గురించి బ్యాడ్‌గా మాట్లాడిన వీడియో బయటకు వచ్చిందో ఆ నెగెటివిటీ మొత్తం రవి మీదకు మళ్లింది.

దాని కారణంగానే ప్రియా అలా మాట్లాడాల్సి వచ్చిందంటూ పలువురు అభిప్రాయపడ్డారు. దీంతో ఆ నెగెటివిటీ మొత్తం లహరిపై పడింది. దీంతో ఓటింగ్ లో కొద్దిపాటి తేడాతో లహరి బటయకు వచ్చింది. అయితే ఇది ఎంతవరకు నిజమో ఆదివారం ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago