బిగ్‌బాస్ సీజన్ 5 లో ఇప్పటికే ఇద్దరు బయటకు వెళ్లారు. ఇక అందులో మిగిలింది 17 మంది. అందులో కూడా ఒకరు బయటకు వెళ్లడానికి సమయం దగ్గర పడింది. ఇప్పటికే ఆ కంటెస్టెంట్ ను బయటకు పంపించారు. కానీ రేపు ప్రేక్షకులకు ఎవరనేది తెలవనుంది. కానీ లీకుల రాజాలు ఎవరు ఎలిమినేట్ అయ్యారో చెప్పేశారు. ఎక్కువ శాతం ఈ వారం ప్రియాంక బయటకు వెళ్తుంది అనుకున్నారు..

కానీ లహరి (అమ్ము) బయటకు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వారం శ్రీరామచంద్ర, మానస్, ప్రియ, ప్రియాంక, లహరి నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఎక్కువగా శ్రీరామ్, మానస్ భారీ ఓట్లతో ఓటింగ్‌లో ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. వీరి తర్వాత ప్రియాంక కూడా మంచి ఓట్లే సంపాదించుకున్నట్లు సమాచారం. అయితే మిగిలింది ప్రియా మరియు లహరి.
చివరకు వీళ్లిద్దరిలో ప్రియా సేఫ్ లోకి వెళ్లిపోయి.. లహరి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఏం జరిగిందటే.. ఎలిమినేషన్ రోజు ప్రియాపై ఎక్కువగా నెగెటివిటీ వచ్చేసింది. కానీ ఇక్కడ రవి.. కారణంగా లహరి బయటకు వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే.. రవి.. ఇంట్లో పెళ్లికాని వాళ్లు ఉన్నప్పటికీ ఆమె నా వెంట పడుతుంది అంటూ ప్రియతో లహరి గురించి బ్యాడ్‌గా మాట్లాడిన వీడియో బయటకు వచ్చిందో ఆ నెగెటివిటీ మొత్తం రవి మీదకు మళ్లింది.
దాని కారణంగానే ప్రియా అలా మాట్లాడాల్సి వచ్చిందంటూ పలువురు అభిప్రాయపడ్డారు. దీంతో ఆ నెగెటివిటీ మొత్తం లహరిపై పడింది. దీంతో ఓటింగ్ లో కొద్దిపాటి తేడాతో లహరి బటయకు వచ్చింది. అయితే ఇది ఎంతవరకు నిజమో ఆదివారం ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
































