ప్రముఖ కంపెనీ టీవీఎస్ స్కూటర్ ను కొనుగోలు చేయాలని అనుకునే వారికి శుభవార్త చెప్పింది. టీవీఎస్ స్కూటర్లపై అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. కొత్తగా టూవీలర్ కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు నెలకు 1,777 రూపాయలు చెల్లించడం ద్వారా స్కూటర్ ను కొనుగోలు చేసే అవకాశాన్ని టీవీఎస్ కల్పిస్తోంది. స్కూటీ పెప్ ప్లస్ మోడల్ స్కూటర్ కొనుగోలుపై ప్రస్తుతం ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
బై నౌ పే లేటర్ ఆప్షన్ ద్వారా టీవీఎస్ కంపెనీ స్కూటర్ ను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఉండటం గమనార్హం. సాధారణంగా కొన్ని కంపెనీలు తక్కువ మొత్తంలో ఈ.ఎం.ఐ చెల్లించి బైక్, స్కూటర్ కొనుగోలు చేసే అవకాశం కల్పించినా ఎక్కువ మొత్తం వడ్డీని వసూలు చేస్తాయి. అయితే టీవీఎస్ మాత్రం తక్కువ వడ్డీకే స్కూటర్ ను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఉండటం గమనార్హం.
టీవీఎస్ సంస్థ వెబ్ సైట్ లో ఈ విషయాలను పొందుపరిచింది. టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ మోడల్ ప్రస్తుతం 6.99 శాతం నుంచి వడ్డీ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధర 52,772 రూపాయలుగా ఉంది. టీవీఎస్ స్కూటీ పెప్ ప్రస్తుతం రెండు వేరియంట్ల రూపంలో అందుబాటులో ఉంది. ప్రాంతాన్ని బట్టి ఎక్స్‌షోరూమ్ ధరలలో స్వల్పంగా మార్పులు ఉంటాయని తెలుస్తోంది.
టీవీఎస్ కంపెనీ ఈ స్కూటర్ భారత్ లో నంబర్ 1 ఎకనమికల్ స్కూటర్ అని ప్రచారం చేసుకుంటూ ఉండటం గమనార్హం. ఈ మోడల్ స్కూటర్ మెట్ ఎడిషన్, గ్లాసీ ఎడిషన్ లలో అందుబాటులో ఉండగా గ్లాసీ మోడల్ ధర 52 వేల రూపాయలుగా, మెట్ ఎడిషన్ ధర 54,422 రూపాయలుగా ఉంది. 10 వేల రూపాయల కంటే తక్కువ మొత్తం డౌన్ పేమెంట్ చెల్లించి ఈ స్కూటర్ ను కొనుగోలు చేయవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…