ప్రముఖ కంపెనీ టీవీఎస్ స్కూటర్ ను కొనుగోలు చేయాలని అనుకునే వారికి శుభవార్త చెప్పింది. టీవీఎస్ స్కూటర్లపై అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. కొత్తగా టూవీలర్ కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు నెలకు 1,777 రూపాయలు చెల్లించడం ద్వారా స్కూటర్ ను కొనుగోలు చేసే అవకాశాన్ని టీవీఎస్ కల్పిస్తోంది. స్కూటీ పెప్ ప్లస్ మోడల్‌ స్కూటర్ కొనుగోలుపై ప్రస్తుతం ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

బై నౌ పే లేటర్ ఆప్షన్ ద్వారా టీవీఎస్ కంపెనీ స్కూటర్ ను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఉండటం గమనార్హం. సాధారణంగా కొన్ని కంపెనీలు తక్కువ మొత్తంలో ఈ.ఎం.ఐ చెల్లించి బైక్, స్కూటర్ కొనుగోలు చేసే అవకాశం కల్పించినా ఎక్కువ మొత్తం వడ్డీని వసూలు చేస్తాయి. అయితే టీవీఎస్ మాత్రం తక్కువ వడ్డీకే స్కూటర్ ను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఉండటం గమనార్హం.

టీవీఎస్ సంస్థ వెబ్ సైట్ లో ఈ విషయాలను పొందుపరిచింది. టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ మోడల్ ప్రస్తుతం 6.99 శాతం నుంచి వడ్డీ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధర 52,772 రూపాయలుగా ఉంది. టీవీఎస్ స్కూటీ పెప్ ప్రస్తుతం రెండు వేరియంట్ల రూపంలో అందుబాటులో ఉంది. ప్రాంతాన్ని బట్టి ఎక్స్‌షోరూమ్ ధరలలో స్వల్పంగా మార్పులు ఉంటాయని తెలుస్తోంది.

టీవీఎస్ కంపెనీ ఈ స్కూటర్ భారత్ లో నంబర్ 1 ఎకనమికల్ స్కూటర్ అని ప్రచారం చేసుకుంటూ ఉండటం గమనార్హం. ఈ మోడల్ స్కూటర్ మెట్ ఎడిషన్, గ్లాసీ ఎడిషన్ లలో అందుబాటులో ఉండగా గ్లాసీ మోడల్ ధర 52 వేల రూపాయలుగా, మెట్ ఎడిషన్ ధర 54,422 రూపాయలుగా ఉంది. 10 వేల రూపాయల కంటే తక్కువ మొత్తం డౌన్ పేమెంట్ చెల్లించి ఈ స్కూటర్ ను కొనుగోలు చేయవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here