Bullet Bhaskar : జబర్దస్త్ వేదిక ద్వారా మంచి కమెడియన్ గా గుర్తింపు పొందిన బుల్లెట్ భాస్కర్ మొదటిసారి తన వ్యక్తిగత విషయాలను చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. తాను జబర్దస్త్ కి రాకముందు ఎదుర్కొన్న పరిస్థితులు, ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నప్పటి పరిస్థితుల గురించి చెప్పాడు. కమెడియన్ గానే కాకుండా రైటర్ గాను బాగా ఫేమస్ అయిన భాస్కర్ కు మిమిక్రీ టాలెంట్ కూడా ఉంది. మహేష్ బాబు ని చాలా చక్కగా అనుకరిస్తాడు.
ప్రేమలో మోసపోవడం వల్ల ఆత్మహత్య…
బుల్లెట్ భాస్కర్ జబర్దస్త్ కి ముందు తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను షేర్ చేసుకున్నాడు. ఒక అమ్మాయిని రెండేళ్లు ప్రేమించి, కలిసున్నాక తనకు చెప్పకుండా వదిలేసి వెళ్లిపోయిందని, ఇక అలా మోసపోయాక పిచ్చోడిలా విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్ ఇలా ఊర్లు పట్టుకుతిరిగాను. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది. తలకు చాలా దెబ్బలు తగిలించుకుని కుట్లు కూడా పడ్డాయి. ఇక ఆ తరువాత హైదరాబాద్ వచ్చి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను అని చెప్పాడు.
నన్ను వదిలి వెళ్లిన వాళ్ళు నన్ను చూసి కుళ్లకునేలా ఎదగాలని నిర్ణయించుకుని కష్టపడ్డాను, అంది వచ్చిన జబర్దస్త్ అవకాశాన్ని వదులుకోకుండా కష్టపడ్డాను. ఒక అమ్మాయి మోసం చేసిందంటే ఆ అమ్మిని కొట్టడం, తిట్టడం, వేధించడం వంటివి చేస్తారు కొందరు కానీ నేను నా ఎదుగుదల చూపించాలనుకున్నా, నన్ను మోసం చేసిన వాళ్లకు నా ఎదుగుదల చెప్పుతో కొట్టినట్టు అనిపించాలని భావించానంటూ తన బ్రేక్ అప్ స్టోరీ చెప్పాడు భాస్కర్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…