సాధారణంగా మనం ఎన్నో వస్తువులను నిరుపయోగం అని పారేస్తూ ఉంటాము. కానీ సరైన ఆలోచనా విధానంతో చూస్తే ప్రతి వస్తువు మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విధంగా అవసరమనుకున్న వస్తువులను సరైన క్రమంలో ఉపయోగించడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చని కేరళకు చెందిన మరియా కురియాకోస్ అనే మహిళ నిరూపిస్తోంది.
కురియాకోస్ అనే మహిళ వాడి పడేసిన పాత కొబ్బరిచిప్పలు సేకరించి వాటిని అందమైన వంటింటి పాత్రలుగా అద్భుతంగా రూపుదిద్దుతోంది. ఈ విధమైనటువంటి అందమైన పాత్రలు చేయడానికి ఆమె
థెంగా అనే స్టార్టప్‌ను ప్రారంభించింది. పాత కొబ్బరి చిప్పలను సేకరించి వాటిని యంత్రాల సహాయంతో నునుపు చేసి వాటిని ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నారు.
ఈ విధంగా పాత కొబ్బరి చిప్పలకు అలంకరించడానికి ఆమె పలువురు కళాకారులను ఉద్యోగంలో నియమించుకుంది. ఈ క్రమంలోనే కళాకారుల సహకారంతో ఈమె తన వ్యాపారాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు నడుపుతోంది. సాధారణంగా మనం మన వంటింట్లో చిన్న చిన్న ప్లాస్టిక్ సామాన్లులను ఉపయోగించడం చూస్తుంటాము. అయితే ఇది పూర్తిగా రసాయనాలతో తయారైన వస్తువులు.
ఈ విధమైనటువంటి ప్లాస్టిక్ వస్తువుల స్థానంలోకి ఈ యువతి కొబ్బరి చిప్పలతో తయారుచేసిన పాత్రలను పరిచయం చేసింది.వీటిని ఎంతో సహజసిద్ధంగా తయారు చేయటం వల్ల వీటిలో ఆహార పదార్థాలను నిల్వ చేసుకున్న ఎలాంటి హానికరం ఉండదు. ప్రస్తుతం ఈ యువతి కేరళలోని 5 జిల్లాలలో 12 మంది కళాకారులను నియమించుకొని తన వ్యాపారాన్ని కొనసాగిస్తుంది. ఈ విధంగా అందంగా తయారు చేసిన ఆ పాత్రలను సెట్ల రూపంలో విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని పొందడమే కాకుండా పలువురికి ఉపాధిని కూడా కల్పించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…