Featured

ఇంట్లో కూర్చుని వేల రూపాయలు సంపాదించొచ్చు.. ఎలా అంటే..?

మనలో చాలామంది డబ్బు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. అయితే బిజినెస్ చేయడానికి తగినంత పెట్టుబడి లేకపోవడం వల్ల చాలామంది వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపరు. అయితే కొన్ని వ్యాపారాల ద్వారా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందవచ్చు. రుచిగా వంటలు చేయడం వస్తే చాలు సులభంగా డబ్బులు సంపాదించడం సాధ్యమవుతుంది. ఫుడ్ బిజినెస్ ద్వారా అదిరిపోయే లాభాలను సొంతం చేసుకోవచ్చు.

స్విగ్గీ యాప్ స్విగ్గీ డైలీ పేరుతో ఇంట్లో చేసిన వంటలను కస్టమర్లకు డెలివరీ చేస్తోంది. వంటలు రుచిగా వండేవాళ్లు స్విగ్గీ డైలీ ద్వారా మీరు చేసిన వంటలను ఇతరులకు స్విగ్గీ ద్వారా విక్రయించి ఆదాయం సంపాదించవచ్చు. పెద్దగా డబ్బులు అవసరం లేకుండా ఇంటి నుంచే సులభంగా ఈ బిజినెస్ ను ప్రారంభించవచ్చు. మీ ఇంట్లో ఇతరుల సహాయం కూడా తీసుకుంటే సులభంగా స్విగ్గీ డైలీ ద్వారా డబ్బు సంపాదించడం సాధ్యమవుతుంది.

తక్కువ ధరలో ఇంటి ఫుడ్ ను కొనుగోలు చేయాలనుకునే వాళ్ల కోసం స్విగ్గీ ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్ల ఆహారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపని వాళ్లు ఈ యాప్ ద్వారా ఆర్డర్ చేయడానికి ఆసక్తి చూపుతారు. స్విగ్గీ డైలీ యాప్ లో రిజిష్టర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం కొన్ని మెట్రో నగరాల్లో మాత్రమే స్విగ్గీ డైలీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే భవిష్యత్తులో ఇతర నగరాల్లో సైతం ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

ఏడేళ్ల క్రితం కార్యకలాపాలను ప్రారంభించిన స్విగ్గీ సేవలను అంతకంతకూ విస్తరిస్తోంది. టైర్ 2 సిటీలలో సైతం కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్లను అందుబాటులో ఉంచుతూ స్విగ్గీ కస్టమర్లకు ప్రయోజనం చేకూరుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago