Buttabomma Poster:సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందడంతో సినిమాలకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఎంతో క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే ఒక సినిమాలో సన్నివేశాలు కానీ మ్యూజిక్ కానీ పోస్టర్లు కానీ మరొక సినిమాతో పోలి ఉంటే పెద్ద ఎత్తున కాపీ ఇష్యూ గురించి భారీ ట్రోలింగ్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం ఇలాంటి ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్నారు నిర్మాత నాగ వంశీ.
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవరనాగ వంశీ నిర్మాణంలో శౌరి చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం బుట్ట బొమ్మ.కప్పేలా అనే మలయాళ సూపర్ హిట్ చిత్రానికి రీమేగా ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అర్జున్ దాస్, అనికా సురేంద్రన్, సూర్య వశిష్ట వంటి వారు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ వీడియోలకు మంచి స్పందన లభించింది.
ఇక ఈ సినిమా జనవరి 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ఒక పోస్టర్ విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్ పెద్ద ఎత్తున కాపీ వివాదాన్ని ఎదుర్కొంటుంది. 2006లో నోలన్ దర్శకత్వంలో వచ్చిన ది ప్రెస్టేజ్ అన్ సినిమా పోస్టర్ నుబుట్ట బొమ్మ సినిమాకు కాఫీ కొట్టినట్లు ఉందని నేటిజన్స్ నాగ వంశీని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
ఇలా చివరికి పోస్టర్లు కూడా కాపీ కొట్టాల నాగ వంశి అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే నేటిజన్స్ నాగ వంశీని ఇలా టార్గెట్ చేయడానికి మరొక కారణం కూడా ఉంది. తాజాగా ఈయన అవతార్ 2 సినిమా గురించి స్పందిస్తూ… ఈ సినిమా ఏ మాత్రం బాగాలేదని కానీ జేమ్స్ కామెరాన్ సినిమా కాబట్టి చూడాలా అనే విధంగాసినిమాపై స్పందించడంతో ఇదే విషయాన్ని టార్గెట్ చేస్తూ నాగ వంశిని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…