మనం సాధారణంగా కార్లు, సుమోలు గాల్లో తేలడం సినిమాలలో చూసి ఉంటాము.సినిమా కనుక అలాంటి సన్నివేశాలు చూడటానికి ఎంతో సంబరపడి పోతాము. అయితే నిజ జీవితంలో ఇలాంటి సంఘటనలు చూడాలంటే కొంచెం గుండె ధైర్యం ఉండాలి. అదేవిధంగా నిజ జీవితంలో మన కళ్ళముందు ఇలాంటి సంఘటనలు జరిగితే చూడటానికి ఎంతో భయంకరంగా ఉంటుంది. అందుకే రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ సరైన మార్గంలో వెళ్లాలి. లేదంటే ఈ కారుకు జరిగిన విధంగానే మనకు ప్రమాదం జరగక మానదు.
అమెరికాలోని కాలిఫోర్నియా యుబా సిటీలోని హైవే 99 పై ప్రయాణిస్తున్న ఒక కారు అచ్చం హాలీవుడ్ సినిమాలను తలపించే విధంగా గాల్లో దుమ్ము లేపుతూ విమానం లాగా చక్కర్లు కొడుతూ కిందపడింది. ఈ విధంగా గాల్లో తేలుతూ కింద పడటంతో ఆ కారు క్షణాలలో నుజ్జునుజ్జయింది. ఈ ఘటన అదే హైవే పై ప్రయాణిస్తున్నటువంటి ఒక ట్రక్ డాష్ బోర్డు కెమెరాలో రికార్డయ్యాయి.ఈ క్రమంలోనే సదరు ట్రక్ కొద్దిగా వేగంతో ప్రయాణించిన ప్రమాదం మరింత ఎక్కువగా జరిగి ఉండేది.
ఈ వీడియోలో భాగంగా అవతలి వైపు కారులో ప్రయాణం చేస్తూ వస్తున్న మహిళ వేగంతో వస్తు కారును ఎడమవైపుకు తిప్పే ప్రయత్నం చేసింది.ఈ క్రమంలోనే కారు అదుపు తప్పి గాల్లో ఎగిరి కింద పడిందని స్థానికులు చెబుతున్నారు.ఈ కారు గాల్లో పల్టీలు కొడుతూ కింద పడినటువంటి ఘటన డాష్ బోర్డ్ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ ఘటన చూసిన ట్రక్కులో ఉన్నటువంటి జంట వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ విధంగా ఒక్కసారిగా కారు కింద పడటంతో ఎంతో భయభ్రాంతులకు గురి అయిన ఈ జంట ఆ తర్వాత ఆ కారు వద్దకు చేరుకోగా అందులో ఓ మహిళ ఉండటంతో ఆమెను బయటకు తీశారు. అదృష్టం కొద్ది మహిళకు తీవ్ర ప్రమాదం తలెత్తలేదు. దీంతో ఆ మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ కారు ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…