సాధారణంగా మనం మొసలిని చూడగానే ఆమడ దూరం పరిగెడతాము. కానీ ఓ దొంగ మాత్రం ఆ మొసలిని దొంగలించాడు. మొసలిని దొంగలించడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అవును ఓ దొంగ మొసలిని దొంగలించి ఎత్తుకెళ్లి పోతుండగా సమాచారం అందుకున్న పోలీసులు అతనిని వెంబడించి అతని నుంచి మొసలికి విముక్తి కల్పించిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలు ఆ దొంగ మొసలిని ఎందుకు దొంగతనం చేశాడు… అలా చేయడానికి కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
అర్ధరాత్రి సమయంలో ఓ వ్యక్తి మొసలిని దొంగతనం చేసి తీసుకెళ్తూ డేటోనా బీచ్ షోర్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ అధికారులు కంట పడ్డాడు.ఈ క్రమంలోనే అతనిని వెంబడించి పోలీసులు అతని దగ్గర నుంచి మొసలిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే మొసలిని దొంగతనం చేయడం వెనుక గల కారణాలను విచారించారు.
ఈ విధంగా మొసలిని దొంగలించిన వ్యక్తి పేరు బుబ్బా హాడ్జ్ అతడు ఈ మొసలిని డేటోనా బీచ్ సమీపంలో పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన మడుగులో నుంచి దొంగలించినట్టు తెలుస్తోంది. ఈ విధంగా సదరు వ్యక్తి మొసలిని దొంగతనం చేయడానికి గల కారణం ఏంటని పోలీసులు ప్రశ్నించడంతో అతను పోలీసులకు దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు. కేవలం ఆ మొసలికి గుణపాఠం చెప్పడం కోసమే దానిని దొంగలించానని చెప్పాడు.
మొసలికి గుణపాఠం చెప్పడానికి అతను ప్రాణాలకు తెగించి మొసళ్ళు నివసించే మడుగు కట్టిన ఇనుప కంచెను దూకి దానిని దొంగలించాడు. ఏదిఏమైనా ఈ విధంగా మొసలికి గుణపాఠం చెప్పాల్సినంత పగ ఎందుకు పెంచుకున్నాడనే విషయం మాత్రం తెలియడం లేదు.ఏదిఏమైనా ఈ విధంగా మొసలిని దొంగతనం చేసినందుకు గాను పోలీసులు ఆ వ్యక్తికి మాత్రం సరైన గుణపాఠం చెప్పారు.ఈ ఘటనకు సంబంధించిన చిత్రాన్ని DBSDPS అధికారులు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడమే కాకుండా ఈ ఘటనకు పాల్పడిన అందుకుగాను ఆ వ్యక్తికి ఏకంగా 4500 డాలర్లు జరిమానా విధించి పూచీకత్తుపై బెయిల్ పై విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…