Category Archives: Health News

బొప్పాయి గింజలను పడేస్తున్నారా.. ఇది తెలిస్తే అస్సలు పడేయరు?

బొప్పాయి పండు తినటానికి రుచిగా ఉండటమే కాకుండా బొప్పాయి పండు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బొప్పాయి పండును తినేటప్పుడు దానిలోని విత్తనాలను తీసేస్తూ ఉంటారు.ఇలా విత్తనాలను పడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మనం కోల్పోతున్నాము. మనం పడేసి బొప్పాయి విత్తనాలలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు.

బొప్పాయి గింజలు ఎందుకు పనికి రావని అంటారు. కానీ బొప్పాయి గింజలలో ఉండే పోషక పదార్థాలు గురించి చాలామందికి తెలియదు. బొప్పాయి గింజలను ఎండబెట్టి వాటిని పొడి చేసుకుని నీటిలో కలుపుకొని తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.

బొప్పాయి గింజలలో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్- సి సమృద్ధిగా ఉంటుంది. మన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి గుండె సంబంధిత వ్యాధులు నయం చేయటానికి బొప్పాయి పండు గింజలు బాగా ఉపయోగపడతాయి. రక్తపోటు వ్యాధితో
బాధపడేవారు బొప్పాయి గింజలు పొడి తాగటం వల్ల బ్లడ్ ప్రెజర్ ను అదుపులో ఉంచుతుంది.

బొప్పాయి పండు ప్రతిరోజు తినటం వలన మన శరీర కాంతి పెరుగుతుంది. చాలా రకాల బ్యూటీ ప్రొడక్ట్ లో బొప్పాయి పండును ఉపయోగిస్తారు. అలాగే బొప్పాయి విత్తనాలు కూడా చర్మకాంతి పెరగటానికి ఉపయోగపడతాయి. అధిక బరువు సమస్యతో బాధపడేవారు బొప్పాయి గింజలను ఉపయోగించడం వల్ల వారి సమస్య అదుపు చేయవచ్చు.

ఈ సమస్యలతో బాధపడేవారు కాలిఫ్లవర్ ను దూరం పెట్టాల్సిందే..!

ఆకుకూరలు, కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. కొద్దిమంది ఉదయమే పచ్చి కూరగాయలను ఆకుకూరలను తింటూ ఉంటారు. కూరగాయలలో మరియు ఆకుకూరలలో మన శరీరానికి అవసరమైన అనేక రకాల విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇలా ఒక్కొక్క ఒక సీజన్లో ఒక్కొక్క రకమైన కూరగాయలు లభిస్తాయి. ముఖ్యంగా మనం ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఎక్కువగా తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు మరియు ఎన్ని నష్టాలు తెలుసుకుందాం.

క్యాలీఫ్లవర్ లో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఐరన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. మన ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం కాలీఫ్లవర్ తినక పోవటం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సలహా
ఇస్తున్నారు.

కిడ్నీ సమస్యలతో బాధపడేవారు క్యాలీఫ్లవర్ ను ఎక్కువగా తినటం వల్ల దానిలో ఉండే క్యాల్షియం వల్ల కిడ్నీ సమస్యలు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు కూడా కాలిఫ్లవర్ ఎక్కువగా తినకూడదు.

మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు కూడా క్యాలీఫ్లవర్ తినకూడదు. క్యాలీఫ్లవర్ లో క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల యూరిన్ సమస్యలు ఏర్పడి మూత్రపిండాలకు సమస్య ఇంకా పెరుగుతుంది.కిడ్నీ సమస్యలతో బాధపడేవారు థైరాయిడ్ వంటి సమస్యలతో బాధపడేవారు క్యాలీఫ్లవర్ కు దూరంగా ఉండటం ఎంతో ఉత్తమం.

పరగడుపున మొలకెత్తిన విత్తనాలు తింటున్నారా.. అయితే ఇది మీ కోసమే!

మొలకెత్తిన విత్తనాలు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయం. కానీ మొలకెత్తిన విత్తనాలు ఖాళీ కడుపుతో తినటం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. అధిక బరువుతో బాధపడే వారు మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు.

మొలకెత్తిన విత్తనాలు తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ. కానీ కొందరికి మాత్రమే పరగడుపున ఆ విత్తనాలను తినటం వల్ల అనారోగ్యం పాలవుతారు. వేరుశెనగలు, పల్లీలు, పెసలు, సద్దులు వంటి వాటిని ఒకరోజు మొత్తం నానబెట్టుకుని రాత్రిపూట ఒక బట్టలో ఒకటి పెడితే ఉదయానికి మొలకలు వస్తాయి.

మొలకలు వచ్చిన విత్తనాలు తినటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, అధిక బరువు, బీపీ వంటి సమస్యలు కంట్రోల్ చేయవచ్చు. కానీ గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు, వృద్ధులు వాటిని పరగడుపునే తినటం వల్ల వారికి అజీర్తి, వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి.

మొలకెత్తిన విత్తనాలు పచ్చివి తినటం వల్ల వాటిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్ మన శరీరంలోకి నేరుగా వెళ్లి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందువలన మొలకెత్తిన విత్తనాలను నీళ్లలో ఉడక పెట్టుకొని తింటే వాటిలో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది. మొలకెత్తిన గింజలను పచ్చిగా తినటం కంటే ఉడకబెట్టుకొని తినటం ఆరోగ్యానికి మంచిది.

డయాబెటిస్ తో బాధపడుతున్నారా.. ప్రతిరోజు ఆహారంలో ఇవి తప్పనిసరిగా!

రోజురోజుకు డయాబెటిస్ తో బాధపడే వారి సంఖ్య అధికమవుతోంది. ఇలా డయాబెటిస్ తో బాధపడేవారు డయాబెటిస్ తగ్గించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ మనం తినే ఆహారంలో కొన్ని ఔషధాలు గుణాలు కలిగిన ఆహార పదార్థాలను కలిపి తినటం వల్ల డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. మరి ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తినడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం

మనం రోజు ఆహారంలో భాగంగా తీసుకొనే పసుపు, అల్లం మరియు ఉసిరి కాయలతో డయాబెటిస్ ను అదుపులో ఉంచవచ్చు. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయనీ అందరికీ తెలిసిన విషయం. పసుపులో ఎన్నో యాంటీఆక్సిడెంట్, విటమిన్స్, ఐరన్ ఉంటాయి. పసుపు వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

ఉసిరికాయలు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఉసిరికాయను పసుపుతో కలిపి తీసుకుంటే రక్తంలో ఉండే షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. అలాగే జామకాయ తినడం కానీ లేదా జామ ఆకులను మరిగించి ఆ నీటిని తాగడం వల్ల కూడా డయాబెటిస్ అదుపులో ఉంచవచ్చు.

అల్లం మనం ప్రతిరోజు తీసుకొనే ఆహార పదార్థాలలో ఒకటి అని చెప్పవచ్చు. అల్లంలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. మనం తీసుకునే ఆహార పదార్థాలలో అప్పుడప్పుడు అల్లం వేసుకొని వండుకొని తినడం వల్ల మన రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది . డయాబెటిస్ తో బాధపడేవారు పాలలో కొంచెం పసుపు లేదా అల్లం కలుపుకొని తాగడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది.

చెప్పులు లేకుండా నడుస్తున్నారా..అయితే ఈ ప్రయోజనాలు మీ సొంతం..!

ప్రస్తుత కాలంలో ప్రతి ప్రతి ఒక్కరికి చెప్పులు వేసుకొని నడవటం బాగా అలవాటైపోయింది. చెప్పులు వేసుకొని నడవడం వల్ల మన పాదాలకు రక్షణ ఇవ్వటమే
కాకుండా కొంత అందాన్ని కూడా తెచ్చి పెడతాయి. కానీ పూర్వకాలంలో చాలామంది చెప్పులు వేసుకోకుండా నడిచేవారు. ప్రస్తుత కాలంలో కొందరు ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉంటారు.కానీ ప్రతి రోజూ ఒక ఐదు నిమిషాల పాటు చెప్పులు లేకుండా నడవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇక్కడ తెలుసుకుందాం..

చెప్పులు వేసుకోకుండా కొద్దిసేపు నడవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో నిపుణులు చాలా సందర్భాల్లో వెల్లడించారు. చెప్పులు వేసుకోకుండా నడవడం వల్ల మన పాదాలలోని కండరాలకు కదలిక వచ్చి పాదాలు నొప్పులు లేకుండా మన పాదాలలోని రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. పాదాలలోని చిన్నా పెద్ద కండరాలకు న్యూరల్ కనెక్షన్ ఉండటం వల్ల కొద్దిసేపు చెప్పులు లేకుండా నడిస్తే కండరాలు స్థిరంగా ఉంటాయి.

చెప్పులు లేకుండా నడిస్తే పాదాలలోని కండరాలు కదిలే మన శరీర భంగిమ మరియు నడక స్థిరంగా ఉంటాయి. చెప్పులు లేకుండా నడిచేవారు శరీరాన్ని చాలా బాగా బ్యాలెన్స్ చేసుకోగలరు. రోడ్డుమీద, మట్టి మీద పాదాలతో నడవటం వల్ల పాదాలలోని రక్త ప్రసరణ బాగా జరిగి పాదాలు గట్టిపడతాయి.

అలాగే చిన్న పిల్లలు చెప్పులు లేకుండా నడవడం వల్ల వారికి డయాబెటిస్, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువ. అందుకే పిల్లలు చెప్పుల్లేకుండా అడగటం మట్టిలో ఆటలాడుకోవడం వారి ఆరోగ్యానికి మంచిది.

ఈ సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగుతున్నారా..జాగ్రత్త సుమీ!

కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి ఎంత ఉపయోగమో అందరికీ తెలిసిన విషయమే. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చాలా ప్రమాదం. నిజానికి కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిదని అంటుంటారు. కొబ్బరి నీళ్ళలో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల మన శరీరంలో నీటి శాతం పెరుగుతుంది.

వేసవికాలంలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల మన శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో మాంగనీస్ మరియు శరీరానికి మేలుచేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడే వారు మాత్రం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చాలా ప్రమాదం.

జలుబు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కొబ్బరి నీళ్ళలో ఉండే చలవ వల్ల జలుబు ఇంకా పెరిగే ప్రమాదం ఉంది.కొబ్బరి నీళ్లలో బీపీని తగ్గించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నవారు మందులు వాడుతూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల లో-బిపి పెరిగే ప్రమాదం ఉంది. కావున బిపి ఉన్న వాళ్ళు కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగకూడదు.

కడుపులో ఏదైనా సమస్యలు ఉన్న వారు కానీ, లేక ఏదైనా సర్జరీ చేయించుకున్న వాళ్ళు కానీ కొబ్బరి నీళ్లు తాగకూడదు . ఒకవేళ తాగాలనుకుంటే వైద్యుని సలహా తప్పనిసరి. పొట్ట ఉబ్బరం లేదా కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కూడా కొబ్బరి నీళ్లు తాగకపోవడం ఆరోగ్యానికి మంచిది.

పచ్చి బఠాణీలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఎవరూ వదలరు!

బఠాణీలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిస్తే మీరు క్రమం తప్పకుండా బఠాణీలను తింటారు. బఠానీలు రుచి ఉండటం మాత్రమే కాకుండా బఠాణి లలో ఉండే అనేక పోషకాల వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

పచ్చిబఠాణీలు ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మనకి ఎక్కువగా ఆకలిగా అనిపించదు. పచ్చిబఠాణీలను ఉడకబెట్టికొని మాత్రమే కాకుండా అనేక రకాలుగా కూరలు, సూప్ చేసుకొని తినటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా సన్నబడాలనుకుంటున్న వారు బఠాణీలను ఎక్కువగా తీసుకుంటే మంచిది.
బఠానీలలో ప్రోటీన్ ఫైబర్, ఐరన్ మరియు ఏ ,కె, సి మొదలగు విటమిన్స్ ఉంటాయి. ప్రోటీన్ బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది . విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. బఠాణీలు తినడం వల్ల మధుమేహ సమస్యలను నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.

బఠాణీలు గ్లైసిమిక్ ఎక్కువ కలిగి ఉంటాయి. అందువలన డయాబెటిక్ రోగులు తప్పనిసరిగా బఠాణీలను తీసుకోవాలి. పచ్చి బఠానీలలో లెక్టిన్, ఫైబర్ వంటి యాంటీ న్యూట్రీయన్లు ఉంటాయి.
పచ్చి బఠానీలలో ఉండే మెగ్నీషియం, పొటాషియం గుండెకు ఎంతో మేలు చేస్తాయి. బఠానీలు తినటం వల్ల బీపీని కంట్రోల్ లో ఉంచవచ్చు. పచ్చి బఠానీలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు తాగుతున్నారా.. అయితే ఈ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ?

మనిషి జీవితంలో నీరు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రోజుకి 6 నుండి 7 లీటర్ల నీరు త్రాగటం వల్ల మన శరీరం ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో ఆ నీటిని మనం ప్లాస్టిక్ బాటిల్స్ ద్వారా త్రాగటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం.

ప్లాస్టిక్ బాటిల్ లో నీటిని త్రాగటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్లాస్టిక్ మన అందరి జీవితాలలో రోజువారి పనులలో తప్పక వాడవలసి వస్తున్నది. ప్లాస్టిక్ బాటిల్స్ ద్వారా నీటిని త్రాగటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ప్లాస్టిక్ బాటిల్స్ వాడటం వల్ల కలిగి కొన్ని ఆరోగ్య సమస్యల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం…

ప్లాస్టిక్ బాటిల్స్ ఉపయోగించి తరచూ నీటిని త్రాగటం లేదా ఇతర ఏదైనా ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించి వేడి వేడి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు .ప్లాస్టిక్ బాటిల్ లో తరచుగా నీటిని త్రాగటం ద్వారా ఆ బాటిల్ కు సూర్య కిరణాలు తాకటం వల్ల ఆ వేడికి ఒక రకమైన టాక్సిన్ బాటిల్ నుండి విడుదలవుతుంది. ఆ ఆ నీటిని త్రాగటం ద్వారా స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ప్లాస్టిక్ బాటిల్ లో తరచుగా నీరు త్రాగటం వల్ల రోగ నిరోధక శక్తి క్షీణించి డయాబెటిస్,ఒబిసిటీ,
సంతాన సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా ప్రస్తుత కాలంలో చిన్నారులు అతి చిన్న వయసులోనే ఋతుస్రావ సమస్యలను ఎదుర్కొంటున్నారు. దానికి కారణం ప్లాస్టిక్ ఎక్కువగా వాడటమే అని చెప్పవచ్చు.

చలికాలంలో నిమ్మరసం తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలో తెలుసా?

నిమ్మరసం ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుందో అందరికీ తెలిసిన విషయమే కానీ నిమ్మరసం కేవలం వేసవి కాలంలో మాత్రమే తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చలికాలంలో తీసుకోవడం వల్ల జలుబు వంటి సమస్యలు తలెత్తుతాయనే ఒక అపోహ ఉంది. కానీ చలికాలంలో కూడా నిమ్మరసం ప్రతిరోజు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

నిమ్మరసం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిమ్మరసం ఒక యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్-సి వల్ల మన శరీరంలోని అధిక బరువును అదుపులో ఉంచవచ్చు. నిమ్మరసాన్ని ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం వల్ల స్థూలకాయంతో బాధపడేవారు మరియు గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

నిమ్మరసం తీసుకోవడం వల్ల జ్వరం మరియు వైరల్ ఫీవర్ వంటి లక్షణాలకు చెక్ పెట్టవచ్చు.చలి కాలంలో తరచుగా వచ్చే జలుబు, దగ్గు మరియు సీజనల్ వ్యాధుల నుండి నిమ్మరసం మనల్ని కాపాడుతుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్- సి వల్ల అది యాంటి ఆక్సిడెంట్స్ గా పని చేసి మనకు రోగాల నుండి విముక్తి లభిస్తుంది.

చలికాలంలో నిమ్మరసం తీసుకోవడం వల్ల తలనొప్పి మరియు ఇతర చర్మ సంబంధిత వ్యాధులను అరికట్టవచ్చు .ముఖ్యంగా చలికాలంలో చర్మ సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. విటమిన్-సి వల్ల అదే యాంటీ ఆక్సిడెంట్ గా పని చేసి రక్తాన్ని శుభ్రపరిచి మన శరీరంలోని మలినాలను శుభ్రం చేయడం వల్ల చర్మ సంబంధిత వ్యాధుల నుండి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు.

బొప్పాయిలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. కానీ వీరు మాత్రం తీసుకోకూడదు..!

మనకు లభిస్తున్న పండ్లల్లో చాలా వరకు సీజన్ వారీగా అందుబాటులో ఉంటాయి. కానీ బొప్పాయి మాత్రం ఏడాది అంతటా అందుబాటులో ఉంటుంది. దీని వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలామంది ఈ పండును ఇష్టపడతారు కూడా. కొంతమంది ఈ బొప్పాయిని ఖాళీ కడుపుతో తినడానికి ఇష్టపడతారు.

ఇంకా కొందరు సలాడ్ లేదా స్నాక్ సమయాల్లో తింటారు. బొప్పాయి ఆకుల రసం అయితే.. ప్లేట్ లెట్స్ పడిపోయిన వారికి ఎంతో ఉపయోకరంగా పనిచేస్తుంది. దీనిని సైంటిఫిక్ గా కూడా రుజువు చేశారు. ప్లేట్ లెట్స్ పడిపోయిన వారికి.. ఈ రసంలో కొంచెం తేనెను కలుపుకొని తాగితే అద్బుతంగా పనిచేస్తుందని రుజువు చేశారు. ఒక్క రోజులోనే లక్ష నుంచి 1.5 లక్షల వరకు కౌంట్ పెరిగినట్లు నిర్ధారించారు.

బొప్పాయి ఆకుల రసాన్ని దోమల వల్ల వచ్చే డెంగ్యూ జ్వరాన్ని ఎదుర్కోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న బొప్పాయిని ఎక్కువగా తింటే.. అన్నవాహిక దెబ్బతినే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గర్భంతో ఉన్న వాళ్లు దీనిని తనకూడదు.
ఎందుకంటే.. ఇది గర్భాశయ సంకోచానికి దారితీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి అనేది సమతుల్యంగా ఉండాలి. దీనిని తినడం వల్ల అకస్మాత్తుగా తగ్గుతుంది.

అందుకే ఎక్కువగా తినకపోవడం మంచిది. దీనిలో పెన్సిల్ ఐసోథియోసైనేట్ అనే పదార్థం ఉంటుంది. ఇదే విషానికి కారణం అవుతుంది. అందుకే దీనిని మితంగా తినాలని అంటుంటారు. బొప్పాయిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి విటమిన్ ఏ, సి అవసరం. అయితే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. బొప్పాయిలో కూడా విటమిన్ సీ ఉంటుంది. అందుకే ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.