నిమ్మరసం ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుందో అందరికీ తెలిసిన విషయమే కానీ నిమ్మరసం కేవలం వేసవి కాలంలో మాత్రమే తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చలికాలంలో తీసుకోవడం వల్ల జలుబు వంటి సమస్యలు తలెత్తుతాయనే ఒక అపోహ ఉంది. కానీ చలికాలంలో కూడా నిమ్మరసం ప్రతిరోజు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
నిమ్మరసం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిమ్మరసం ఒక యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్-సి వల్ల మన శరీరంలోని అధిక బరువును అదుపులో ఉంచవచ్చు. నిమ్మరసాన్ని ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం వల్ల స్థూలకాయంతో బాధపడేవారు మరియు గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
నిమ్మరసం తీసుకోవడం వల్ల జ్వరం మరియు వైరల్ ఫీవర్ వంటి లక్షణాలకు చెక్ పెట్టవచ్చు.చలి కాలంలో తరచుగా వచ్చే జలుబు, దగ్గు మరియు సీజనల్ వ్యాధుల నుండి నిమ్మరసం మనల్ని కాపాడుతుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్- సి వల్ల అది యాంటి ఆక్సిడెంట్స్ గా పని చేసి మనకు రోగాల నుండి విముక్తి లభిస్తుంది.
చలికాలంలో నిమ్మరసం తీసుకోవడం వల్ల తలనొప్పి మరియు ఇతర చర్మ సంబంధిత వ్యాధులను అరికట్టవచ్చు .ముఖ్యంగా చలికాలంలో చర్మ సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. విటమిన్-సి వల్ల అదే యాంటీ ఆక్సిడెంట్ గా పని చేసి రక్తాన్ని శుభ్రపరిచి మన శరీరంలోని మలినాలను శుభ్రం చేయడం వల్ల చర్మ సంబంధిత వ్యాధుల నుండి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…