ప్రస్తుత కాలంలో ప్రతి ప్రతి ఒక్కరికి చెప్పులు వేసుకొని నడవటం బాగా అలవాటైపోయింది. చెప్పులు వేసుకొని నడవడం వల్ల మన పాదాలకు రక్షణ ఇవ్వటమే
కాకుండా కొంత అందాన్ని కూడా తెచ్చి పెడతాయి. కానీ పూర్వకాలంలో చాలామంది చెప్పులు వేసుకోకుండా నడిచేవారు. ప్రస్తుత కాలంలో కొందరు ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉంటారు.కానీ ప్రతి రోజూ ఒక ఐదు నిమిషాల పాటు చెప్పులు లేకుండా నడవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇక్కడ తెలుసుకుందాం..
చెప్పులు వేసుకోకుండా కొద్దిసేపు నడవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో నిపుణులు చాలా సందర్భాల్లో వెల్లడించారు. చెప్పులు వేసుకోకుండా నడవడం వల్ల మన పాదాలలోని కండరాలకు కదలిక వచ్చి పాదాలు నొప్పులు లేకుండా మన పాదాలలోని రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. పాదాలలోని చిన్నా పెద్ద కండరాలకు న్యూరల్ కనెక్షన్ ఉండటం వల్ల కొద్దిసేపు చెప్పులు లేకుండా నడిస్తే కండరాలు స్థిరంగా ఉంటాయి.
చెప్పులు లేకుండా నడిస్తే పాదాలలోని కండరాలు కదిలే మన శరీర భంగిమ మరియు నడక స్థిరంగా ఉంటాయి. చెప్పులు లేకుండా నడిచేవారు శరీరాన్ని చాలా బాగా బ్యాలెన్స్ చేసుకోగలరు. రోడ్డుమీద, మట్టి మీద పాదాలతో నడవటం వల్ల పాదాలలోని రక్త ప్రసరణ బాగా జరిగి పాదాలు గట్టిపడతాయి.
అలాగే చిన్న పిల్లలు చెప్పులు లేకుండా నడవడం వల్ల వారికి డయాబెటిస్, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువ. అందుకే పిల్లలు చెప్పుల్లేకుండా అడగటం మట్టిలో ఆటలాడుకోవడం వారి ఆరోగ్యానికి మంచిది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…