దేశం గర్వించదగ్గ దర్శకుల్లో భారతీరాజా ఒకరు. సమకాలిన చిత్రాలకు భిన్నంగా కథలను రాసుకొని అద్భుత చిత్రాలను రూపొందించి.. ఆరు జాతీయ అవార్డులను పొందారు. గాన గంధర్వుడు బాలసుబ్రమణ్యం చెప్పినట్టుగా ఆయన ఎంచుకునే కథలు 30 సంవత్సరాలు అడ్వాన్స్ గా ఉంటాయని చెప్పారు.
ఒక సందర్భంలో.. బాలు, భారతీరాజా కలిసి ఒకే కారులో ప్రయాణిస్తున్నప్పుడు దారి మధ్యలో ‘రాజా’ ఎప్పుడు కథలు చెబుతూ ఉండేవాడని, ఈ రోజుల్లో ఇలాంటి కథలను సినిమాగా తీస్తే ఎవరు చూస్తారన్నప్పుడు.. తను ఎప్పటికైనా దర్శకుడవుతానని ఈ కథలను సినిమాగా తీసి ప్రేక్షకుల చేత చూపిస్తానని అనే వాడని స్వరాభిషేకంలో..బాలసుబ్రహ్మణ్యం వివరించారు.
తను, భారతీరాజా ఇద్దరు పరిశ్రమకు వచ్చిన కొత్తలో జరిగిన సంఘటన గురించి ఆయన నెమరువేసుకున్నారు. భారతిరాజా తమిళంలో ఎక్కువ సినిమాలను రూపొందించారు. తెలుగులో 1981లో సీతాకోకచిలుక చిత్రాన్ని రూపొందించగా మురళి, ముచ్చర్ల అరుణ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చక్కటి ప్రేమకథ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత జమదగ్ని, టిక్ టిక్ టిక్, యువతరం పిలిచింది, కొత్త జీవితాలు, ఈతరం ఇల్లాలు లాంటి చిత్రాలను రూపొందించారు. 1987 సంవత్సరం వచ్చేసరికి “కడలోర్ కవిదైగళ్’ (సముద్రపు ఒడ్డు కథలు)అనే తమిళ చిత్రాన్ని.. గీతా ఆర్ట్స్ తెలుగులోకి అనువదిస్తూ.. చిరంజీవి, సుహాసిని, రాధిక హీరో, హీరోయిన్లుగా ‘ఆరాధన’ చిత్రాన్ని రూపొందించారు.
తెలుగులో చిరంజీవి చేసిన పాత్రని తమిళంలో ప్రముఖ హీరో సత్యరాజ్ చేయడం జరిగింది. అల్లరి చిల్లరగా తిరిగే రౌడీ నివసించే టౌన్ కు ఒక ఉపాధ్యాయురాలు బదిలీపై వస్తుంది. ఒక విషయంలో హీరోను(రౌడీ) ఉపాధ్యాయురాలు మందలించడంతో ఆమెపై కోపానికి రాకుండా పైగా అభిమానిస్తూ.. నిరక్షరాస్యుడైన హీరో ఆమె దగ్గర చదువు నేర్చుకొని తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటాడు. ఆ క్రమంలో ఉపాధ్యాయురాలు(హీరోయిన్) పులి రాజు(హీరో) ఒకరిపై ఒకరు అభిమానం పెంచుకుంటారు.
అలా కొంత కాలం తర్వాత పెళ్లి చేయాలని వారి పెద్దలు సంబంధాలు చూస్తుంటారు. ఆ క్రమంలో ఉపాధ్యాయురాలిని పెళ్లి చేసుకోవడానికి రాజశేఖర్ వస్తారు. ఉపాధ్యాయురాలు ఆ ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటుందనేదే మిగతా కథ. 1987లో మెగాస్టార్ చిరంజీవి దొంగ మొగుడు,పసివాడి ప్రాణం లాంటి సూపర్ డూపర్ చిత్రాలను అందుకున్నప్పటికీ రాజశేఖర్ తో నటించిన ఆరాధన చిత్రం మాత్రం బాక్స్ ఆఫీసు వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…