సూపర్ స్టార్ మహేష్ బాబుకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా వెండితెరకు పరిచయమైన మహేష్ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలనడిగానే ఎంతో ఫేమ్ తెచ్చుకున్నాడు.
ఇక తన రాబోయే చిత్రం ‘సర్కారు వారి పాట’తో సినీ ప్రేమికులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం గీతా గోవింద ఫేమ్ దర్శకుడు పరశురాం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ వరుసగా.. డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళితో చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక అతడు మోకాలి శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉన్నందున.. ఈ సినిమాకు రెండు నెలల విరామం తీసుకున్నాడు.
ఈ వైద్యం కోసం అతడు యూఎస్ వెళ్లనున్నారు. ప్రస్తుతం ఈ విరామ సమయాన్ని అతడు తన కూతురు సితారా, కొడుకు గౌతమ్, అతడి భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల అతడు విలేకురులతో మాట్లాడుతూ.. తన కూతరు సితారకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.
తనకు సంబంధించి ఏ సినిమా అయినా అతడు తన ఫ్యామిలీతోనే కలిసి చూస్తాడట. ఆ సమయంలో సినిమాలో ఫైట్ సన్నివేశాలు వచ్చాయంటే.. తన కూతరు అక్కడ నుంచి వెళ్లి పోతుందని.. ఆ సన్నివేశాలు అంటే తనకు ఇష్టం ఉండదని చెప్పుకొచ్చాడు. కానీ తన సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తారన్నారు.
విడుదలైన మొదటి రోజు ఇంట్లోనే చూస్తాం.. అదో అద్భుతమైన అనుభవం అన్నారు. సినిమాలో అంత వరకు పడిన కష్టం వాళ్లతో కలిసి అలా చూసినప్పుడు పోతుందని అన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…