Categories: FeaturedMovie News

రాజమౌళి – ప్రశాంత్ నీల్‌లకు తేడా అదే.. అందుకే టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు లాక్ చేసుకుంటున్నారు..!

కేజీఎఫ్ ఛాప్టర్ సినిమా రానంత వరకు అందరు మాట్లాడుకుంది రాజమౌళి గురించే. ఆయన బాహుబలి సినిమాలతో తెలుగు సినిమా స్థాయి ఏంటో ప్రపంచవ్యాప్తంగా చూపించారు. హాలీవుడ్ టెక్నాలజీనీ వాడటంతోనూ మన తెలుగు సినిమాకు హాలీవుడ్ సినిమా స్థాయి ఉందని చెప్పడంలోనూ రాజమౌళి తీసిన బాహుబలి సినిమాలే ఉదాహరణ. ఈ రెండు సినిమాలు తెరకెక్కించడానికి రాజమౌళి తీసుకున్న సమయం దాదాపు నాలుగేళ్ళు. ఈ నాలుగేళ్ళు ప్రభాస్ మరో సినిమా చేయడానికి వీలు లేకుండా పోయింది.

ఒక్క ప్రభాస్ మాత్రమే కాదు రానా సహా మిగతా ప్రధాన తారాగణం అంతా ఈ ప్రాజెక్ట్‌లోనే లాకయ్యారు. అయితే అందరు కూడా బాహుబలి ఓ చరిత్ర సృష్ఠించే సినిమా అవుతుందని అలాంటి సినిమా తీస్తున్న రాజమౌళి గురించే మాట్లాడుకున్నారు గాని ఆయన సినిమాల కోసం ఎన్నేళ్ళు తీసుకుంటున్నారని పెద్దగా పట్టించుకోలేదు. సినిమా రిలీజయ్యాక మాత్రం ఈ టాపిక్ వచ్చింది. దీని గురించి రాజమౌళిని అడిగినవారూ ఉన్నారు. దానికి ఆయన చెప్పిన సంమాధానం..బాహుబలి రెండు భాగాలుగా తీసిన సినిమా.

ఇందులో వీఎఫెక్స్, గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్నాయి. దానికే కొన్ని నెలలపాటు హాలీవుడ్ టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేశారు. కాబట్టే ఎక్కువ సమయం బాహుబలికి పట్టింది అన్నారు. ఆయన చెప్పిన సమాధానం హాలీవుడ్ సినిమాతో పోల్చుకుని ఓకే అనుకున్నారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్, ఎన్.టి.ఆర్‌లతో ఆర్ఆర్ఆర్ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం రాజమౌళి చాలా సమయం తీసుకున్నారు. ఈ సినిమా కమిటవకుండా ఉంటే ఇద్దరు హీరోలు కనీసం మూడేసి సినిమాలు చేసుండేవారు.

అయితే కొంత ఆర్ఆర్ఆర్ సినిమా ఆలస్యం కావడానికి కరోనా కూడా కారణం అయింది. ఏదేమైనా రాజమౌళి తెరకెక్కించే పాన్ ఇండియన్ సినిమా అంటే రెండేళ్ళు మించిపోతుననే గట్టి నమ్మకానికి వచ్చేశారు. అయితే కేజీఎఫ్ చిత్రాలను తీసిన ప్రశాంత్ నీల్‌కు మాత్రం అంత సమయం పట్టడం లేదు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న సినిమాలను కూడా పాన్ ఇండియన్ స్థాయిలోనే ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. అన్నీ అనుకూలిస్తే సంవత్సరం లోపే సినిమాను థియేటర్స్‌లోకి తెచ్చేస్తాడు.

బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓ రౌత్ కూడా ప్రభాస్‌తో రూపొందిస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్‌ను త్వరగానే పూర్తి చేశాడు. ఈ కారణాల వల్ల ఇప్పుడు ప్రశాంత్ నీల్‌కు టాలీవుడ్‌లో వరుసగా పాన్ ప్రాజెక్ట్స్ చేసే అవకాశాలు అందుకుంటున్నాడు. రాజమౌళి చెక్కి చెక్కీ రెండేళ్ళకు పైగానే సినిమా కోసం తీసుకుంటుంటే ఏడాదిలోనే ప్రశాంత్ నీల్  సినిమాను పూర్తి చేస్తున్నాడు. పైగా బడ్జెట్ విషయంలోనూ ప్రశాంత్ నీల్ తక్కువ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడు నిర్మాతలకు కావాల్సింది పాన్ ఇండియన్ సినిమా అయినా బడ్జెట్ లిమిట్‌లో ఉండాలని. ఇక హీరోలకు ఎంత త్వరగా ప్రాజెక్ట్ పూర్తైతే అంత త్వరగా మరో ప్రాజెక్ట్‌లోకి వెళ్ళొచ్చు. ఇన్ని కారణాల వల్లే రాజమౌళి కంటే ప్రశాంత్ నీల్ చేతిలో ఎక్కువ సినిమాలున్నాయి. యష్‌తో కేజీఎఫ్ 2, ప్రభాస్‌తో సలార్ చేస్తున్న ప్రశాంత్ నీల్ ఆ తర్వాత రామ్ చరణ్, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ సినిమాలు చేయనున్నాడు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago