బిగ్ బాస్ చూస్తుండగానే 13వ వారంలోకి చేరుకుంది. 13 వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం గురించి సర్వత్రా ఉత్కంఠత ఏర్పడింది. అయితే ఇప్పటి వరకు వస్తున్న కథనాల ప్రకారం పింకీ కాజల్ డేంజర్ జోన్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరిలో ఈ వారం తప్పకుండా ఎవరో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్తారని భావించారు. అయితే ప్రతి వారం రెండు రోజులు ముందుగానే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లే కంటెస్టెంట్ పేరు సోషల్ మీడియాలో పెద్దఎత్తున చక్కర్లు కొడుతుంటాయి.
ఈ క్రమంలోనే ఈ వారం నామినేషన్స్ లో ఉన్నటువంటి మానస్, శ్రీ రామచంద్ర, సిరి, పింకీ, కాజల్ నామినేషన్స్ లో ఉండగా డేంజర్ జోన్లో పింకీ, కాజల్ ఉన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రియాంక బయటకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు గత సీజన్లో కూడా ట్రాన్స్ జెండర్ లు బిగ్ బాస్ కంటెస్టెంట్ లుగా పాల్గొన్నారు. అయితే వారందరూ కూడా మూడు నాలుగు వారాలకు హౌస్ నుంచి బయటకు వెళ్లారు. కానీ ప్రియాంక సింగ్ మాత్రం 13వ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లడం విశేషం. గత రెండు రోజుల క్రితం తమన్నా సింహాద్రి ప్రియాంక సింగ్ ను గెలిపించాలని తనకు మద్దతు తెలుపుతూ ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
అయితే ప్రియాంక సింగ్ 13వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక మొదటి వారం నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వారే హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఈవారం కూడా ప్రియాంక సింగ్ బయటకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. మరి నిజంగానే ప్రియాంక బిగ్ బాస్ ను వీడనున్నారా..లేదా అనేది మరొక రెండు రోజులలో తేలనుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…