ప్రస్తుత కాలంలో ఒక్కో సింగర్ కు పాట పాడితే వారికున్న మార్కెట్ ను బట్టి రెమ్యూనరేషన్ చెల్లిస్తుంటారు. ఈ క్రమంలోనే సాధారణ సింగర్స్ అయితే ఒక 20 వేల వరకు రెమ్యూనరేషన్ ఇవ్వగా కాస్త పేరున్న వారికి 50 నుంచి లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఇస్తారు. అయితే ఈ మధ్య కాలంలో ఎంతో ఫేమస్ అవుతున్న పాటలు ఎక్కువగా సింగర్ సిద్ శ్రీరామ్ పాడుతున్నట్లు మనకు తెలిసిందే..
గీత గోవిందం సినిమాలోని ఇంకేం ఇంకేం కావాలే, అలా వైకుంఠపురం సామజవరగమన, ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా నీలి నీలి ఆకాశంవంటి ఎన్నో అద్భుతమైన పాటలు పాడుతూ విశేష ప్రేక్షకాదరణ పొందిన సిద్ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈయన పేరు చెప్పుకొని ఎంతోమంది దర్శకులు పెద్దఎత్తున ప్రమోషన్ నిర్వహిస్తున్నారు.
ఇలా ఎంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ సింగర్ చేత ప్రతి ఒక్క దర్శకుడు వారి సినిమాలో పాట పాడించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన పాట సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి.ఇలా అద్భుతమైన పాటలతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సిద్ శ్రీరామ్ తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే.
ఈ యంగ్ సింగర్ కేవలం ఒకే ఒక్క పాట పాడితే అక్షరాల 4.5 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటారు. నమ్మడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం అని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈయన ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన ఇతని కోసం దర్శకులు వేచి చూడడం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…