రోజురోజుకు డయాబెటిస్ తో బాధపడే వారి సంఖ్య అధికమవుతోంది. ఇలా డయాబెటిస్ తో బాధపడేవారు డయాబెటిస్ తగ్గించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ మనం తినే ఆహారంలో కొన్ని ఔషధాలు గుణాలు కలిగిన ఆహార పదార్థాలను కలిపి తినటం వల్ల డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. మరి ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తినడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం
మనం రోజు ఆహారంలో భాగంగా తీసుకొనే పసుపు, అల్లం మరియు ఉసిరి కాయలతో డయాబెటిస్ ను అదుపులో ఉంచవచ్చు. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయనీ అందరికీ తెలిసిన విషయం. పసుపులో ఎన్నో యాంటీఆక్సిడెంట్, విటమిన్స్, ఐరన్ ఉంటాయి. పసుపు వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఉసిరికాయలు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఉసిరికాయను పసుపుతో కలిపి తీసుకుంటే రక్తంలో ఉండే షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. అలాగే జామకాయ తినడం కానీ లేదా జామ ఆకులను మరిగించి ఆ నీటిని తాగడం వల్ల కూడా డయాబెటిస్ అదుపులో ఉంచవచ్చు.
అల్లం మనం ప్రతిరోజు తీసుకొనే ఆహార పదార్థాలలో ఒకటి అని చెప్పవచ్చు. అల్లంలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. మనం తీసుకునే ఆహార పదార్థాలలో అప్పుడప్పుడు అల్లం వేసుకొని వండుకొని తినడం వల్ల మన రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది . డయాబెటిస్ తో బాధపడేవారు పాలలో కొంచెం పసుపు లేదా అల్లం కలుపుకొని తాగడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…