ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్న పాత్రలలో, విలక్షణమైన నటనతో అందరిని ఆకట్టుకుంటున్న తారలలో అష్నూర్ కౌర్ ఒకరని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమె ఝాన్సీకి రాణి, యే రిస్తా క్యా కహ్లాతా హై, పాటియాల బేబ్స్ లాంటి సీరియల్స్, పలు చిత్రాలలో నటిస్తూ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు. కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ చదువును ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా చదువులోనూ తనదైన శైలిలో దూసుకుపోతోంది.
తాజాగా నటి అష్నూర్ కౌర్ సీబీఎస్ఈ 12 తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఈ పరీక్ష ఫలితాలు వెలువడటంతో ఈ ఫలితాలలో అద్భుతమైన రికార్డులను నెలకొల్పారు. ఈ పరీక్ష ఫలితాలలో నటి
అష్నూర్‌కు 94 శాతం మార్పులను సాధించింది. ఈ క్రమంలోనే జాతీయ మీడియాతో మాట్లాడిన అష్నూర్.. ఈ పరీక్ష ఫలితాలలో ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు. అయితే చాలా కష్టపడి పరీక్షలు రాశాను. పదవతరగతిలో 93 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించగా అంతకంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కష్టపడ్డానని.. కష్టపడినందుకు ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ పరీక్ష ఫలితాల అనంతరం మార్కెటింగ్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేయాలనుకొంటున్నాను. ఇందుకోసం విదేశాలకు వెళ్లి తన చదువును కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక కెరీర్ పరంగా తనకు పలు సినిమాలలో నటించడమే కాకుండా దర్శక, నిర్మాణ బాధ్యతలు చేపట్టాలనే కోరిక ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు.
ప్రస్తుతం పలు సీరియల్స్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న
అష్నూర్.. సంజూ మన్మర్‌జియాన్ చిత్రంలో నటించారు. త్వరలోనే మరికొన్ని చిత్రాల ద్వారా సందడి చేయనున్నారు. అదే విధంగా ఎన్నో రోజుల నుంచి తన కలలుకంటున్న ఇంటి కల త్వరలోనే నెరవేరుతుందని, ప్రస్తుతం తన కలలుగన్న ఇల్లు నిర్మాణ దశలో ఉందని వచ్చే ఏడాది లోనే గృహప్రవేశం చేయబోతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…