ప్రస్తుతం కరోనా మహమ్మారిని అరికట్టడం కోసం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఐదు సంవత్సరాలలోపు పిల్లలున్న తల్లులకు 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలు టీకాలు వేయించుకోవటం పై కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.
చాలా మంది గర్భిణీ స్త్రీలు టీకాలు వేయించుకోవటం వల్ల ఏదో ప్రమాదం జరగబోతుందనే అపోహలో ఉంటారు. వారిలో ఉన్న అపోహలను తొలగించి ప్రయోజనాలను వివరించాలని ఫ్రంట్లైన్ వర్కర్స్ కు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలోనే గర్భిణీ స్త్రీలకు కరోనా సోకిన ఏ ఒక్కరు కూడా ఆస్పత్రి పాలవకుండా కరోనా నుంచి బయటపడినట్లు పలు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
కేవలం కొందరిలో మాత్రమే కరోనా సోకడం వల్ల దాని ప్రభావం గర్భస్థ పిండం పై పడిందని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఈ క్రమంలోనే గర్భిణీ స్త్రీలు ఎవరూ కూడా కరోనా బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే గర్భిణీ స్త్రీలు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.
ముఖ్యంగా 35 సంవత్సరాలు దాటిన గర్భిణీ స్త్రీలలో షుగర్, ఒబిసిటీ వంటి సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. ఇలాంటి వారికి మరింత ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గతంలో తల్లులకు కరోనా సోకిన కూడా 95 శాతం పిల్లలు సురక్షితంగా ఉన్నారు. అందుకోసమే గర్భిణీ స్త్రీలు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తన మార్గదర్శకాలలో పేర్కొన్నారు.ప్రసవానికి ముందు కరోనా సోకితే ప్రసవం తర్వాత తప్పకుండా మహిళలు వ్యాక్సిన్ వేయించుకోవాలని అధికారులు తెలిపారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. అయితే తాజాగా…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…