కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ షాక్ ఇచ్చింది. ఉద్యోగులకు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకున్న కేంద్రం రైతులకు మాత్రం ప్రయోజనం చేకూర్చడం లేదు. కరోనా విజృంభణ , లాక్ డౌన్ వల్ల దేశంలో రైతులు సైతం భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం రుణ గ్రహీతలకు ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో మార్చి నెల నుంచి ఆగష్టు నెల వరకు వడ్డీపై వడ్డీ మాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా రుణాలు తీసుకున్న వాళ్లందరికీ ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారా..? అయితే మీరు పప్పులో కాలేసినట్లే..? కేంద్రం కొన్ని రుణాలకు మాత్రమే వడ్డీపై వడ్డీ మాఫీని అమలు చేస్తోంది. పర్సనల్ లోన్, ప్రొఫెషనల్స్ అండ్ కన్షప్షన్ లోన్, హౌసింగ్ లోన్, కన్సూమర్ డ్యూరబుల్ లోన్, ఎంఎస్ఎంఈ రుణాలు, ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న వాళ్లకు మాత్రమే కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం కలగనుంది.
కొన్ని రకాల రుణాలు తీసుకున్న వాళ్లకు మాత్రం కేంద్రం వడ్డీపై వడ్డీ మాఫీ ప్రయోజనాలను అందించడం లేదు. క్రాప్ లోన్, ట్రాక్టర్ లోన్స్ తో పాటు వ్యవసాయ, వ్యవసాయ సంబంధిత రుణాలకు కేంద్రం వడ్డీపై వడ్డీ మాఫీని అమలు చేయడం లేదు. దీంతో కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. ఉద్యోగులు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా చేసిన కేంద్రం రైతులను మాత్రం విస్మరించడం గమనార్హం.
కేంద్రం వ్యవసాయ రుణాలకు వడ్డీపై వడ్డీ మాఫీ చేయకపోవడం గురించి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ 2కోట్ల రూపాయల లోపు రుణం తీసుకున్న వారికి మాత్రమే ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. ఎక్స్‌గ్రేషియా స్కీమ్ డబ్బులు అర్హులకు నేరుగా బ్య్ంక్ ఖాతాలలో జమవుతాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…