Chaitanya master friend Sriram : ఢీ డాన్స్ షో ద్వారా అందరికీ సుపరిచితుడైన చైతన్య మాస్టర్ శనివారం నాడు నెల్లూరు లోని క్లబ్ హోటల్ లో ఆత్మహత్య చేసుకుని మరణించడంతో టెలివిజన్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఎపుడూ అందరినీ నవ్విస్తూ సరదాగా ఉండే చైతన్య మాస్టర్ ఒక్కసారిగా దూరం అవ్వడం ఢీ లో పనిచేస్తున్న డాన్స్ మాస్టర్లు అలాగే బాయ్స్ ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలో ఇంట్లో వాళ్లకు స్నేహితులకు ఢీ మిత్రులకందరికీ సారీ చెప్పి ఆర్థిక ఇబ్బందులతోనే చనిపోతున్నట్లు చెప్పి ఉరి వేసుకున్న చైతన్య మాస్టర్ గురించి ఆయన స్నేహితుడు శ్రీరామ్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
అప్పులు ఆత్మహత్యకు కారణం కాదు…
చైతన్య మాస్టర్ ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియోలో తాను ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పి మరణించారు. అయితే ఆయన స్నేహితుడు శ్రీరామ్ మాత్రం చైతన్య చనిపోడానికి కారణం ఆర్థిక ఇబ్బందుకు కాదంటూ తెలిపారు. తాను అడిగితే సహాయం చేసేవాళ్ళు చాలా మందే ఉన్నారని అయితే ఆర్థిక ఇబ్బందులు కూడా మరీ అంత ఎక్కువగా ఏమి లేవని తెలిపారు. చనిపోయే రెండు రోజుల ముందు కూడా తాను కాల్ చేసి పేమెంట్స్ ఇచ్చేవాళ్ళు ఇవ్వడం లేదు అని చెప్పాడు.
నేనే వచ్చి కూర్చొని మాట్లాడి సెటిల్ చేసుకోవాలి అని చెప్పి చాలా వరకు మెంటల్ టెన్షన్స్ తగ్గించుకుందామని అనుకుంటున్నాను, రెండు నెలల్లో పెళ్లి ఫిక్స్ అవ్వబోతోంది ఆ లోపు అన్నీ క్లియర్ చేసుకుని సెటిల్ అవుతాను అంటూ చెప్పాడు. హైదరాబాద్ వచ్చాక మాట్లాడుతాను అంటూ చెప్పాడు. సోమవారం వచ్చాక మాట్లాడుతానని చెప్పినవాడు ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని అనుకోలేదు, చాలా షాకింగ్ గా అనిపించింది అంటూ చెప్పారు.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…