Categories: FeaturedMovie News

Chandra Bose: వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ వివాదం.. యండమూరికి కౌంటర్ ఇచ్చిన చంద్ర బోస్..?

Chandra Bose: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమా నుండి టైటిల్ సాంగ్ కూడా విడుదల చేశారు . ఈ టైటిల్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుంటుంది.

ఇదిలా ఉండగా ఇటీవల ప్రముఖ నవలా రచయిత మోటివేషనల్ స్పీకర్ అయిన యండమూరి వీరేంద్రనాథ్ వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ లోని లిరిక్స్ గురించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. వాల్తేరు వీరయ్య సినిమా టైటిల్ సాంగ్ కి చంద్రబోస్ రాసిన లిరిక్స్ గురించి విమర్శిస్తూ.. ఈ పాటలో సాహిత్యం అర్థం లేకుండా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఈ పాటలోని ” తుఫాన్ అంచున తపస్సు చేసే వశిష్టుడే వీడే.. తిమిర నేత్రమై ఆవరించిన త్రినేత్రుడే వీడే ” అని పంక్తిని ఉద్దేశిస్తూ.. తిమిరం అంటే శివదూషణం కాదా ? ఇలాంటి పిచ్చి రాతలు ఎవరు రాశారు? అంటూ వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ గురించి సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశాడు.

ఇలా ఈ పాట గురించి యండమూరి విమర్శలు చేయడంతో తాజాగా ఈ పాట రాసిన చంద్రబోస్ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా చంద్రబోస్ స్పందిస్తూ.. తాను రాసిన పాటలోని లైన్లు విరోధాబాసా అలంకారం కింద్రకు వస్తాయని గుర్తు చేశాడు. పరస్పరం విరుద్ధమైన రెండు పదాలను లోతుగా పరికిస్తే విరోధం తొలగిపోయి ఆ పదబంధం లోతు తెలుస్తుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ విషయం రచయితలు అందరికీ తెలుసునని, తనకు తెలుసు కాబట్టే ఈ ప్రయోగం చేశానని క్లారిటీ ఇచ్చాడు.

Chandra Bose: ఆ విషయం తెలియని వారే అసలైన తిమిరం..

అంతేకాకుండా అసలు తిమిరంలోని నిగూఢ అర్థం తెలియని వారే అసలైన తిమిరం అంటూ యండమూరికి చంద్రబోస్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. అలాగే ఈ పాట విషయంలో ప్రముఖ రచయిత సత్యానంద్ తనకు ఫోన్ చేసి సాహిత్య పరంగా అధ్యయనం చేయవలసిన గీతమిది అంటూ తనని ప్రశంసించిన విషయం గురించి కూడా ఈ సందర్భంగా చంద్రబోస్ తెలియజేశాడు .

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago