Adusumilli Srinivasarao : చంద్రబాబు సభలో తొక్కిసలాట వెనుక కుట్ర..!! ప్రీ ప్లాన్ తో చేసింది వాళ్లేనా?? షాకింగ్ విషయాలు బయటపెట్టిన అనలిస్ట్ ఆడుసుమిల్లి శ్రీనివాసరావు…!

Adusumilli Srinivasarao : ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికలకు ఇంకో సంవత్సరం సమయం ఉంది అయితే అప్పుడే ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతూ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పొత్తులు, పర్యటనలు అంటూ బిజీ అయిపోయారు. ఇక ఏపీలో అయితే ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ సభ ఏర్పాటు చేసినా అక్కడ బాగా జనం రావడం కనిపిస్తోంది. అయితే జనం రావడామేమో కానీ భద్రతా వైఫల్యమో లేక కావాలని కుట్ర చేస్తున్నారో కానీ తొక్కిసలాట జరిగి అవాంఛనీ య సంఘటనలు జరిగాయి. ఇటీవల జరిగిన కందుకూరు, గుంటూరు సభలలో తొక్కిసలటలో ప్రజలు ఇబ్బందులను ఎదూర్కోవడం ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఇక వీటిపై ప్రతిపక్షం ఒకలా చెబుతుంటే అధికారం పక్షం మాత్రం తన వాదన ఇంకోలా వినిపిస్తోంది. ఈ విషయాల మీద పొలిటికల్ ఎనలిస్ట్ ఆడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఆయన విశ్లేషణ అందించారు.

తొక్కిసలాట వెనుక కుట్ర…

ఆడుసుమిల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సభలకు జనం స్వచ్చందంగా వస్తున్నారన్నది వాస్తవం. దాన్ని అడ్డుకోడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోంది అంటూ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేకత వల్లే చంద్రబాబు సభలకు జనం వస్తున్నారంటూ అది చూసి ఓర్వలేక ఇలాంటి వ్యూహలను వైసీపీ ప్రభుత్వం చేస్తుందంటూ తెలిపారు. చంద్రబాబు సభలకు ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ఇప్పుడు ఇలాంటి తొక్కిసలాటలు జరగడం ఏమిటి, ప్రభుత్వం తగిన విధంగా భద్రత చర్యలు తీసుకోకపోవడం అయినా జరుగుండాలి లేకపోతే కొంతమందిని సభలకు జనాలను రెచ్చగొట్టడానికే పంపి ఇలాంటి సంఘటనలు జరిగేలా ప్రోత్సాహిస్తుండాలి అంటూ చెప్పారు. గుంటూరు సభలో జరిగిన తొక్కిసలాట గురించి గ్రౌండ్ లెవెల్లో విచారించినపుడు తోఫా పంపిన అంత వరకు సవ్యంగా జరిగినా ఒక్కసారిగా ఎవరో ఇక తోఫా అయిపోతోంది చివర ఉన్నవాళ్లకు దక్కదు అంటూ వదంతులు పుట్టించేసరికి ఒక్కసారిగా తోపులట జరిగింది.

అందులోనూ అక్కడ ఉన్న కొంతమంది అక్కడి జనాలను రెచ్చగొట్టడానికి జై జగన్ అంటూ నినాదాలు కూడా చేసారు, ఇవన్నీ కావాలని కొంతమంది చేసినవని తెలిసిపోతోంది. ఇక అక్కడ పోలీసులు కనీసం 200 మంది కూడా లేరు. ఒక సీఎం సభకు 2000 మంది పోలీసులు మినిస్టర్స్ కి కూడా ఇంటి దగ్గర కాపాలకు చాలా మంది పోలీసులు ఉంటున్నారు. అలాంటప్పుడు ఒక సభ అందులోనూ అంత మంది జనం వస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వంకి తెలియదా అంటూ ఆడుసుమిల్లి వాఖ్యాణించారు. కందుకూరులో తొక్కిసలాట జరిగి జనం మరణించినా మళ్ళీ గుంటూరు సభకు జనం వచ్చారంటే జగన్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అర్థమవుతోంది అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago