Actor Sameer : దూరదర్శన్ లో కెరీర్ మొదలు పెట్టి సీరియల్స్ లో నటించిన సమీర్ ఋతురాగాలు, శాంతి నివాసం వంటి సీరియల్స్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక బాలసుబ్రమణ్యం గారు దర్శకత్వం వహించిన ‘శుభ సంకల్పం’ సినిమాలో నటించిన సమీర్ ఆ తరువాత చాలా సినిమాల్లో సహాయ నటుడుగా చేసాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా వచ్చి అలరించిన సమీర్ సినిమాల్లోనూ అటు టీవీ ప్రోగ్రామ్స్ లోనూ కనిపిస్తున్నారు. తన కెరీర్ మొదట్లో పడ్డ కష్టాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
నేను అన్ని మతాలను పాటిస్తాను…
సమీర్ పేరు వినగానే అందరూ తనని ముస్లిం అని భావిస్తారు. అలానే ఇండస్ట్రీ చాలా మంది కన్ఫ్యూస్ అయ్యేవారట. ఒకసారి మెగాస్టార్ చిరంజీవి కూడా అసలు నీ మతమేంటి అని అడిగారట. ఎందుకంటే ఆ సమయంలో సమీర్ అయ్యప్ప మాల ధరించారట. ముస్లిం అయ్యప్ప మాల ఏంటి అని అడిగితే నేను అన్ని మతాలనూ పాటిస్తానంటూ చెప్పారట. ఎవరైనా ముస్లిమా అని అడిగితే నేను ఇండియన్ అని చెప్తారట సమీర్.
నిజానికి సమీర్ వాళ్ళ నాన్న ముస్లిం తల్లి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారట. అయితే చిన్నప్పుడే తండ్రి దూరమవడం వల్ల అమ్మమ్మ దగ్గర పెరగడం వల్ల హిందూ ఆచారాలు బాగా తెలుసంఊ అయితే తన దేవుడి గదిలో ముస్లిం, హిందూ, క్రిస్టియన్ దేవుళ్ళ పటాలు ఉంటాయంటూ తెలిపారు. ఇక తాను ఇప్పటికి ఐదు సార్లు అయ్యప్ప మాల ధరించానంటూ తెలిపిన సమీర్ తనకు పౌరానిక పాత్రలు ధరించినపుడు నిష్టగా నాన్ వెజ్ తినకుండా ఉంటానంటూ తెలిపారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…