Producer Suresh Babu : మూవీ మొఘల్ రామానాయుడు గారు సినిమా ఇండస్ట్రీకి ఎంతో సేవచేశారు. సినిమా నిర్మాతగా ఎన్నో సినిమాలను నిర్మించారు. అలాగే స్టూడియో ద్వారా కూడా ఎన్నో సినిమాలకు సదుపాయలను అందుబాటులో ఉంచారు. ఇక రామానాయుడు గారి కొడుకులు సురేష్ బాబు, వెంకటేష్ బాబు ఇద్దరూ కూడా సినిమా రంగంలోనే ఉన్నారు. సురేష్ బాబు తండ్రి లాగా నిర్మాణ రంగంలో ఉంటూ సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఎన్నో సినిమాలను నిర్మించారు. ఇక వెంకటేష్ గారు అగ్ర హీరోగా ఎన్నో హిట్ సినిమాలను ఇండస్ట్రీకి ఇచ్చారు. ఇక సినిమా రంగంలో పెద్ద కుటుంబాల్లో ఒకటిగా ఉన్న దగ్గుబాటి ఫ్యామిలీ రాజకీయల్లోకి అడుగుపెట్టారు, అయితే ప్రస్తుతం క్రియాశీలకంగా లేరు. ఇక ఏపీ లో ఎందుకు స్టూడియో కట్టలేదు వంటి విషయాల మీద సురేష్ బాబు గారు మాట్లాడారు.
ఏపీలో స్థలం ఇస్తామన్నా స్టూడియో కట్టలేదు…
సినిమా ఇండస్ట్రీ మద్రాస్ నుండి తరలి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయ్యాక అభివృద్ధి చెందడానికి ఎన్నో ఏళ్ళు పట్టింది. హైదరాబాద్ స్టూడియోలు డబ్బింగ్ థియేటర్లు ఇలా అన్నీ సమకూరడానికి చాలా ఏళ్ళు పట్టింది. అయితే పరిస్థితులు మారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయాయి. ఇక ఏపీ అభివృద్ధికి సినిమా ఇండస్ట్రీ కూడా కృషి చేయాలని భావించిన ప్రభుత్వం ఏపీలో స్టూడియోలు కట్టడానికి భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
మొదట ఏర్పడిన టీడీపీ ప్రభుత్వంలో పలు దఫాలు చర్చలు కూడా ఇందుకోసం జరిగాయి. వీటి గురించి మాట్లాడుతూ స్టూడియో కట్టడానికి స్థలం ఇస్తామనే హామీ అప్పటి ప్రభుత్వం నుండి వచ్చినా కావాల్సింది కేవలం స్థలం మాత్రమే కాదు అన్నది నా అభిప్రాయం, అందుకే నిర్మించలేదు అని చెప్పారు సురేష్ బాబు. హైదరాబాద్ లో ఎన్నో స్టూడియోలు డబ్బింగ్ థియేటర్స్ ఇలా ఎన్నో నిర్మించినా ఇప్పటికీ స్కిల్డ్ టెక్నీషియన్స్ కోసం మనం చెన్నై కి వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పటికీ ఆ విషయంలో మార్పు లేదు, అలాంటప్పుడు స్టూడియోలు కాదు కట్టాల్సింది స్కిల్డ్ టెక్నీషియన్స్ ను తయారు చెసుకోవాలి, అందుకోసం కృషి చేయాల్సి ఉంది అంటూ అభిప్రాయపడ్డారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…