Featured

Actor Baladithya : నేను సుహాసిని పెళ్లిచేసుకోబోతున్నాం అని… మేము వాటి గురించి ఆలోచించలేదు..: నటుడు బాలాదిత్య

Actor Baladithya : బాలనటుడిగా 40 కి పైగా సినిమాల్లో నటించి ఆ తరువాత హీరోగా దాదాపు పది సినిమాలను చేసిన బాలాదిత్య ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా కూడా వచ్చారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన అన్న కౌశిక్ తో కలిసి సీరియల్స్, సినిమాల్లో నటించిన బాలాదిత్య తన నటనకు నంది అవార్డు కూడా అందుకున్నాడు. ఇక హీరోగా ‘చంటిగాడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడినా ఆ తరువాత్స్ పెద్దగా హిట్లు లేకపోవడంతో చదివు మీద దృష్టి పెట్టి సినిమాలకు దూరమయ్యడు. ఇక మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలదిత్య ఓటీటి ప్లాట్ ఫామ్ లో తన నటనకు ఆస్కారమున్న కథలను చేస్తున్నారు. ఇక చిన్న వయసులోనే పెద్ద దర్శకులతో పనిచేసిన బాలాదిత్య అప్పటి అనుభవాలను పంచుకున్నారు.

సుహాసిని తో నా రిలేషన్…

బాలాదిత్య హీరోగా చేసిన మొదటి సినిమా చంటిగాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన సుహాసిని గురించి మాట్లాడుతూ మేమిద్దరం మంచి స్నేహితులం అంటూ చెప్పారు. ఇక ఆ సినిమా తరువాత మళ్ళీ ‘సుందరానికి తొందరెక్కువ’ సినిమాలో కూడా నటించారు. రెండు సినిమాల్లో కలిసి నటించడం, అదీకాక ఏదైనా ఈవెంట్ జరిగినా ఫంక్షన్స్ కైనా ఇద్దరూ కలిసి వెళ్లడం లాంటివి చేయడంతో అప్పట్లో మీడియాలో వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు వినిపించేవి.

ఇక వీటి గురించి బాలాదిత్య మాట్లాడుతూ అవన్నీ ఒట్టి పుకార్లే అందిలో నిజం లేదు. మొదటి సినిమా నుండి తాను పరిచయం, మేమిద్దరం అప్పటి నుండి మంచి స్నేహితులం అంటూ చెప్పారు. మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది అంటూ చెప్పారు. అందుకే మా గురించి ఎలాంటి రూమర్స్ పట్టించుకోలేదు అంటూ మాట్లాడారు. ఇక బాలాదిత్య 2016 లో పెద్దలు కుదుర్చిన వివాహం చేసుకున్నారు.

Bhargavi

Recent Posts

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

22 hours ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

22 hours ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

22 hours ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

22 hours ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

22 hours ago

మీలో దాగి ఉన్న జంతువు ఏది? మీ వ్యక్తిత్వానికి సరిపడేది ఎలా తెలుసుకోవాలి?

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…

22 hours ago