Actress Pragathi: తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలలో నటించి మెప్పించిన నటి ప్రగతి అందరికీ ఎంతో సుపరిచితమే.ఎంతోమంది యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటించిన ఈమె ఈ మధ్యకాలంలో సినిమాలు కాస్త తగ్గించిందని చెప్పాలి. ఇలా సినిమాలలో ఈమె సందడి చేయలేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ప్రగతి ఆంటీ హవా మామూలుగా లేదని చెప్పాలి.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నాలుగు పదుల వయసులో ఆమె చేసే వర్కవుట్లకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు. అదే విధంగా పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా ప్రగతి సందడి చేస్తున్నారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన రెండో పెళ్లి గురించి పలు విషయాలను తెలియజేశారు.
ప్రగతి పెళ్లి చేసుకొని భర్త నుంచి దూరంగా ఉంటున్నారు. అయితే ఈమె కూతురు ఆలనా పాలన చూసుకుంటూ ఒంటరిగా గడుపుతున్నారు.అయితే ఇప్పుడు నాలుగు పదుల వయసులో కూడా నటీమణులు పెళ్లి చేసుకోవడం ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే రెండో పెళ్లి గురించి ఈమెను ప్రశ్నిస్తూ ఎప్పుడైనా రెండో పెళ్లి చేసుకోవాలని ఆలోచన వచ్చిందా అని అడగడంతో.. పెళ్లి అనేదానికన్నా కంపానియన్ అంటే బెటర్. నాకు ఒక కంపానీయన్ ఉంటే బాగుండేది అనిపిస్తుందని ఈమె తెలిపారు.
కంపానియన్ ఉంటే బాగుంటుంది అనిపించిన మరి నా మెచ్యూరిటీ లెవెల్ కి తగ్గ వాళ్ళు వస్తారా అనే సందేహం కలుగుతుంది. అంతేకాకుండా సింగల్ పర్సన్ దొరకడం చాలా కష్టం.ఒకవేళ దొరికిన నాతో అడ్జస్ట్ అవడం చాలా కష్టం ఎందుకంటే నేను కొన్ని విషయాలలో ఇలాగే ఉండాలి అనే వ్యక్తిత్వం కలదాన్ని.సో నేను 20 లలో ఉంటే కనుక అడ్జస్ట్ అయ్యేదాన్ని కానీ ఇప్పుడు అడ్జస్ట్ కావడం అంటే చాలా కష్టమని ఈమె తన రెండో పెళ్లి గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…