Chandra Babu Naidu: ఏపీ ఎన్నికల ఫలితాలు మరొక నాలుగు రోజులలో తెలియనున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఎన్నికలు పూర్తికాగానే తమ ఫ్యామిలీలతో కలిసి నేతలందరూ కూడా పర్యటనలకు వెళ్లారు. అయితే ఒక్కొక్కరుగా తిరిగి ఇండియా చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన భార్యతో కలిసి అమెరికా పర్యటన వెళ్లినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
ఇక ఈయన హైదరాబాద్ రావడంతో పెద్ద ఎత్తున నేతలు అభిమానులు కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇక హైదరాబాద్ చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలతో కలిసి కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన నేతలకు కార్యకర్తలకు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు.
ఎన్నికల ఫలితాలు రోజు ప్రతి ఒక్కరు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వైసీపీ నేతలు చేసే దాడులను ఎదుర్కోవాలని వారి కుట్రలను ఖండించాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అంతేకాకుండా మొదటిసారి ఈయన ఎన్నికల ఫలితాల గురించి కూడా స్పందించారు.
అప్రమత్తంగా ఉండాలి..
జూన్ 4వ తేదీ వెలువడే ఫలితాలలో కూటమి అధికారంలోకి వస్తుందని తెలిపారు.. జనసేన, బీజేపీ పొత్తు కలిసి వచ్చిందని, ప్రజలందరూ కార్యకర్తలందరూ కూడా ఎంతో అద్భుతంగా పనిచేశారని ఈయన ప్రశంసలు కురిపించారు. ఇక ఎన్నికల ఫలితాలలో వైసీపీ కేవలం 35 సీట్లకు మాత్రమే పరిమితం కాబోతుందని ఈ సందర్భంగా బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…