Character artist Hema : తెలుగులో హీరోయిన్ స్నేహితురాలిగా మొదలై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన హేమ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వల్ల కూడా బాగా వైరల్ ఐన హేమ ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలిచారు. ఆ మధ్య మా ఎన్నికల సమయంలో శివబాలాజీ తో గొడవ, కొరకడం వంటి విషయాలతో బాగా వైరల్ అయింది హేమ. ఇక హేమ ఎవరి గురించైనా ఏ మాత్రం జంకు లేకుండా ఫ్రాంక్ గా మాట్లాడేస్తుంది. అలా ఇపుడు సురేఖ వాణి కూతురు గురించి కూడా హాట్ కామెంట్స్ చేసింది.
సుప్రీత చాలా బోల్డ్…
ఇండస్ట్రీ లో తనకు ఎవరైనా ప్రాణ స్నేహితులు ఉన్నారంటే అది సురేఖ వాణి నే అంటూ హేమ చెప్పారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి చాలా సినిమాల్లో తల్లి, వదిన, అక్క పాత్రలతో మెప్పించింది. ఇక సురేఖవాణి, హేమ బెస్ట్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ పిల్లలు సుప్రీత, ఇషా కూడా మంచి స్నేహితులని హేమ చెప్పారు. ఇద్దరు ఒకే స్కూల్ లో చదివే వారని అయితే వాళ్ళ స్నేహం సురేఖ వాణి కి నచ్చలేదని అందుకే సుప్రీతను వేరే స్కూల్ కి పంపించిదని, కానీ సుప్రీత మళ్ళీ నా కూతురు చదివే స్కూల్ కి వచ్చిందని చెప్పారు. దీనికి కారణం సుప్రీత చాలా బోల్డ్ గా ఉంటుంది అంటూ హేమ కామెంట్స్ చేసారు.
ఇక సురేఖ వాణి నేను మంచి స్నేహితులుగా ఉండగా సినిమాల్లో నటించేటపుడ నా వెనకాల వేరే వాళ్ళతో నా గురించి తప్పుగా మాట్లాడింది అందుకే అప్పటి నుండి మా మధ్య దూరం పెరిగింది అంటూ హేమ, సురేఖ వాణి గురించి చెప్పింది. ఇక తాజాగా సురేఖ వాణి కూతురు సుప్రీత పుట్టినరోజు సెలెబ్రేషన్స్ ను చాలా గ్రాండ్ గా సురేఖ వాణి జరిపారు. సుప్రీత సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటుంది. ఇంస్టాగ్రామ్ రీల్స్ లో తన తల్లి తో కలిసి డాన్సులు చేయడం వంటివి చేస్తూ మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇక తాజాగా పుట్టినరోజు వేడుకలో సురేఖ సుప్రీత కు మద్యం తాగించడం తో మరో సారి ఇద్దరు వైరల్ అయ్యారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…