టాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఛార్మి ప్రస్తుతం నిర్మాణ బాధ్యతలను చేపడుతూ బిజీగా ఉన్నారు. అదికూడా పూరి జగన్నాథ్ నిర్మించే చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.పూరి కనెక్ట్స్ బ్యానర్ వ్యవహారాలన్నీ ఛార్మీనే చూసుకుంటున్నారు. అయితే తాజాగా చార్మి ఈ విషయంపై స్పందించి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పూరీ జగన్నాథ్ చార్మి ముంబైలోనే ఉంటున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉండగా కరోనా వల్ల ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతుండగా మరోసారి కరోనా అడ్డుపడుతోంది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా మహారాష్ట్ర ముంబై వంటి ప్రాంతాలలో రోజురోజుకు లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ కరోనా మహమ్మారి విలయ ప్రతాపాన్ని చూసి ఛార్మి చలించిపోయారు. ఇటువంటి పరిస్థితులను చూసి తట్టుకునే శక్తి నాకు లేదు.. అందుకే కొన్ని రోజుల పాటు సోషల్ మీడియా నుంచి తప్పుకుంటానని ఛార్మి తెలిపారు.
ఈ సందర్భంగా చార్మి మాట్లాడుతూ ఈ భయంకరమైన పరిస్థితులలో ప్రజలందరూ ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తగా సురక్షితంగా ఉండాలని, ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను. మీతో పాటు మీరు ప్రేమించే వ్యక్తుల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండండి అంటూ ఛార్మి చేతులు జోడించి వేడుకున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…