Categories: FeaturedMovie News

Chethan Cheenu : సందీప్ కిషన్ నాకు షెల్టర్ ఇచ్చాడు.. నాని, మనోజ్ నా చేతి వంట తినేవాళ్ళు… సాయి కొర్రపాటి తో సినిమా ఆగిపోడానికి కారణం..!

Chethan Cheenu : ఒక్కోసారి మనకు ఎంత మంచి ఫిల్మ్ సర్కిల్ ఉన్నా అవకాశాలు రావు. అయితే వచ్చిన కొద్ది అవకాశాలను సధ్వినియోగం చేసుకుంటేనే గ్లామర్ ఫిల్డ్ లో ఉంటాం. అదే జరిగింది చేతన్ కి కూడా. మంత్ర 2, రాజుగారి గది వంటి హార్రర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో కంటే ముందే తమిళంలో పలు సినిమాల్లో నటించినా హీరోగా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ నచ్చిన పాత్రలను చేస్తూ వచ్చాడు. పెళ్లికి ముందు ప్రేమ కథ సినిమాలో తెలుగులో హీరోగా చేసిన పెద్దగా సక్సెస్ అవ్వలేదు. నిజానికి చేతన్ సత్యం డైరెక్టర్ సూర్యకిరణ్, కళ్యాణిలకు బంధువు సూర్యకిరణ్ వాళ్ళ ఇంట్లోనే పెరిగాడు.

సందీప్ కిషన్ మంచి స్నేహితుడు…

సినిమా ఫీల్డ్ లో ఎవరు గాడ్ ఫాదర్ లేకపోయినా కనీసం తెలిసిన వ్యక్తి ఉన్నా కొంత ఉపయోగ పడుతుంది. ఏ రంగంలో అయినా పరిచయాలు మనం ఎదగడానికి ఉపయోగపడుతాయి. చేతన్ కి మొదటి నుండి సినిమా సర్కిల్ ఉంది చెన్నై లో ఉంటున్నపుడే హీరో సందీప్ కిషన్ లాంటి స్నేహితులు ఉన్నారు. ఇక హైదరాబాద్ లో అవకాశాల కోసం వచ్చాక సందీప్ కిషన్ దగ్గరే ఉంటూ కొద్ది రోజులు అవకాశాల కోసం ప్రయత్నించాడు. ఇక వంట సూపర్ గా చేసే చేతన్ తన వంట రుచిని అప్పట్లో సినిమా అవకాశాల కోసం వెతుకుతున్న నాని వంటి మిత్రలతో పంచుకునేవాడట, ఇక మనోజ్ కూడా చేతన్ ఫుడ్ కి ఫ్యాన్. ఇక చేతన్ కి ప్రొడ్యూసర్ కే ఎస్ రామారావు గారి అబ్బాయి అలెగ్జాండర్ వల్లభ మంచి ఫ్రెండ్. ఇక తన అన్న సూర్యకిరణ్ వల్ల ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి తో కూడా మంచి అనుబంధం ఉంది. అలానే సాయి కొర్రపాటి నిర్మాణం లో ఒక సినిమా ప్లాన్ చేసారు.

సూర్యకిరణ్ డైరెక్టర్ గా మలయాళం సినిమా స్ఫూర్తితో సినిమా కథ సిద్ధం చేసుకున్నారు. అంతా ఓకే అనుకుని కథలో ఐదు మంది హీరోయిన్లు ఉండాలని ముంబై వెళ్లి హీరోయిన్ ఆడిషన్ కూడా చేసారు. అయితే సినిమా మొదలు పెట్టే టైం కి మలయాళం సినిమా హక్కులను వేరేవాళ్ళు కొనుక్కున్నారు దీంతో సినిమా ఆపేయాల్సి వచ్చింది. నిజానికి సినిమా రీమేక్ చేయాలని అనుకోలేదు, కేవలం కథలో కొన్ని పాయింట్స్ తీసుకున్నారు, కానీ సినిమా రీమేక్ రైట్స్ కూడా తీసుకుంటే గొడవ ఉండదు అని భావించి చేతన్ తీసుకోవాలని అనుకునే సమయానికి వేరే వాళ్ళు రైట్స్ తీసుకున్నారు, అలా ఆ సాయి కొర్రపాటి సినిమా ఆగిపోయింది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago