Chinmayi: యూట్యూబర్స్ గా పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సిరి, శ్రీహాన్ గురించి అందరికీ సుపరిచితమే.సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈ ఇద్దరు బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత గుర్తింపు పొందారు. ఇక బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈ జంట బుల్లితెర కార్యక్రమాల ద్వారా కూడా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇకపోతే వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నప్పటికీ ఇదివరకే ఒక బాబుని దత్తత తీసుకొని బాబు బాధ్యతలను సిరి శ్రీహన్ తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే.అయితే తాజాగా సిరి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ఇందులో భాగంగా సిరి కుమారుడు ఏదో తప్పు చేయడంతో శ్రీహాన్ బెల్ట్ తో తనని తాను కొట్టుకుంటూ ఇంకొకసారి ఇలా చేస్తావా అంటూ తనని బ్లాక్మెయిల్ చేశారు.
ఇలా తన తండ్రి తనని కొట్టుకోవడంతో పిల్లాడు భయపడి ఇకపై అలా చేయను మీరు చెప్పిన విధంగానే వింటాను సారీ డాడీ అంటూ బాగా ఏడ్చేసాడు. ఇక ఈ వీడియోని సిరి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో పై సింగర్ చిన్మయి స్పందించారు. ఈ క్రమంలోనే చిన్మయి స్పందిస్తూ…పిల్లలను బ్లాక్ మెయిల్ చేయడం కోసం మనల్ని మనం హింసించుకోవడం సరైనది కాదు. ఇలా చేయటం వల్ల పిల్లలు సైకోలుగా మారే అవకాశాలు ఉన్నాయి.
ఇండియాలో చాలామంది పేరెంట్స్ తమని తాము హింసించుకొని పిల్లలను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అయితే ఇది పూర్తిగా తప్పు ఇకపై ఇలాంటి వాటికి పులి స్టాప్ పెట్టాలి అంటూ సింగర్ చిన్మయి శ్రీహాన్ వీడియో పై స్పందిస్తూ పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొందరు శ్రీహాన్ చేస్తున్నది పూర్తిగా తప్పు అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…