Categories: FeaturedMovie News

Chiranjeevi: మెగా ఫ్యాన్స్ కి శుభవార్త.. త్వరలోనే చిరంజీవి ఆటో బయోగ్రఫీ.. ఎవరు రాస్తున్నారో తెలుసా?

Chiranjeevi: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. గత ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మెగాస్టార్ చిరంజీవి, ప్రస్తుతం దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కబోతున్న విశ్వంభర అనే సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరంజీవికి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ ఆ వార్త ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి జీవితం పుస్తక రూపంలోకి రాబోతుందట. ఆయనపై ఆటోబయోగ్రఫీ రానుంది. ఇదే విషయాన్నీ తాజాగా చిరంజీవి ప్రకటించారు. మరి చిరంజీవి ఆటో బయోగ్రఫీని ఎవరు రాస్తున్నారు అన్న వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్‌ స్టార్ హీరోస్ అయినా ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజు వంటి వారిపై పుస్తకాలు రాశారు రచయితలు, జర్నలిస్టులు. వీరిలో ఒక్కొక్కరు ఒక్కో యాంగిల్‌లో తీసుకుని పుస్తకాలు రాశారు. అలాగే చిరంజీవిపై కూడా కొన్ని పుస్తకాలు వచ్చాయి. కానీ పూర్తిగా ఆయన జీవితాన్ని ఆవిష్కరించే ఆటో బయోగ్రఫీ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. తాజాగా ఆ పుస్తకానికి శ్రీకారం చుట్టబోతున్నారు.

త్వరలో మెగాస్టార్‌ చిరంజీవి ఆటోబయోగ్రఫీ రాబోతుంది. అది ఒక స్టార్‌ రైటర్‌ రాయబోతున్నారు. ఇప్పటి వరకు ఎన్నో పుస్తకాలు రాసి స్టార్‌ రైటర్‌గా పేరుతెచ్చుకున్న యండమూరి వీరేంద్రనాథ్‌ ఈ పుస్తకాన్ని రాయబోతున్నారు. తాజాగా చిరంజీవి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్‌ 28వ వర్థంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ లను గుర్తు చేసుకుంటూ ఓకే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.. యండమూరి వీరేంద్రనాథ్‌ పై ప్రశంసలు కురిపించారు. ఆయన సినిమాల్లో ఆయన పాత్ర ఎంతో ఉందని, ఆయన రాసిన పుస్తకాల ఆధారంగానే ఎన్నో సినిమాలు చేసినట్టు తెలిపారు.

నా స్టార్ డమ్ కి ఆ స్టోరీలే కారణం..

ఒక రకంగా తనకు స్టార్‌ డమ్‌ తెచ్చిన సినిమాలకు ఆయన రాసిన స్టోరీలే కారణమని అన్నారు చిరు. 80వ దశకంలో చాలా వరకు ఆయన రాసిన రచనలు, కథలు, పాత్రలు తనకు స్టార్‌ డమ్‌ రావడంలో కీలక పాత్ర పోషించాయని తెలిపారు. ఆ క్రెడిట్‌ యండమూరికే దక్కుతుందని చెప్పారు. మెగాస్టార్‌ అనే పేరు వచ్చింది కూడా ఆయన సినిమానే కారణమన్నారు చిరు. అభిలాష పుస్తకాన్ని తన అమ్మ ముందుగా చదివి చెప్పిందని, ఆ రెండు మూడు రోజులకే మద్రాస్‌లో అదే కథతో కేఎస్‌ రామారావు తనతో సినిమా చేసేందుకు వచ్చారని తెలిపారు. అందులో హీరో పాత్ర కూడా చిరంజీవినే అని, అది కాకతాళియమో ఏమోగానీ, ఆ సినిమా నేను చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆ సినిమా పెద్ద విజయం సాధించి తనలో నమ్మకాన్ని పెంచిందని, ఇక మనకు తిరుగులేదనే నమ్మకాన్ని ఇచ్చిందని తెలిపారు మెగాస్టార్‌ చిరంజీవి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago