Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గత కొంతకాలంగా మోకాలు నొప్పి సమస్యతో బాధపడుతున్నారంటూ ఓ వార్త వైరల్ గా మారింది. అయితే ఈయన త్వరలోనే సర్జరీ కూడా చేయించుకోబోతున్నారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి తాజాగా చిరంజీవి ఢిల్లీలో మోకాలి నొప్పి సమస్యకు సర్జరీ చేయించుకున్నారని తెలుస్తుంది.
ఇలా ఢిల్లీలో ఈయనకు మోకాలి నొప్పికి సర్జరీ సక్సెస్ ఫుల్ అయిందని ఒక వారం రోజులపాటు ఢిల్లీలోని ఉన్న అనంతరం మరోసారి హెల్త్ చెకప్ చేయించుకున్న తర్వాత చిరంజీవి హైదరాబాద్ తిరిగి రానున్నట్టు తెలుస్తుంది.ఇలా భోళా శంకర సినిమా తర్వాత చిరంజీవి వెంటనే తన తదుపరి సినిమా అని ప్రకటించబోతారని అందరూ భావించారు కానీ ఈయన మాత్రం కొన్ని నెలలపాటు సినిమాలకు దూరం అవుతున్నారని తెలుస్తుంది.
మోకాలు నొప్పికి సర్జరీ నిర్వహించడంతో రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందని డాక్టర్లు సూచించారట ఈ క్రమంలోని ఈ రెండు నెలల పాటు చిరంజీవి సినిమాలకు పూర్తిగా దూరం కాబోతున్నారు. చిరంజీవి తన తదుపరిచిత్రం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయబోతున్నారు. అన్ని అనుకూలంగా ఉండి ఉంటే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ప్రకటించేవారు.
ఇక చిరంజీవికి మోకాలు నొప్పి సర్జరీ చేయడంతో ఈయన రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోబోతున్నారని అయినప్పటికీ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి లేకపోయినా దర్శక నిర్మాతల సమక్షంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సినిమా మాత్రం రెండు నెలల తర్వాత రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటుందని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…