మెగా డాటర్ నిహారకకు మెగస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. కారణం ఏంటో తెలుసా.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీ నుంచి వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో ప్రత్యేక గుర్తింపు ఏర్పుర్చుకుంది. యాంకరింగ్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన నిహారిక హీరోయిన్‌గానూ వెండితెరపై తన సత్తా చాటింది. అటు హీరోయిన్గా పలు సినిమాల్లో నటిస్తన్న సమయంలోనే వెంకట చైతన్యతో వివాహం జరిగింది.
ఈ పెళ్లి వేడుకను రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిపించిన విషయం తెలిసిందే. అయితే ఆమెకు వివాహం అయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దానికి కారణం కూడా ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పకొచ్చారు. తన భర్తకు ఇష్టం లేకనే తాను సినిమాల్లోకి రావడం లేదని చెప్పింది. వివాహం అనంతరం కూడా నిహారిక వెబ్ సిరీస్ చేస్తూ ఉంది.
అందులో నటించడంతో పాటు సొంతంగా నిర్మిస్తుంది కూడా. తాజగా ఆమె ఇటీవల రూపొందించిన వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’. ఈ వెబ్ సిరీస్ జీ 5లో ట్రెండింగ్ లో దూసుకపోతోంది. ఈ సిరీస్ ప్రతీ ఒక్కరిని కట్టిపడేసింది. సగటు మధ్య తరగతి కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో.. కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇటీవల ఈ వెబ్ సిరీస్ చూసిన మెగస్టార్ చిరంజీవి.. నిహారికకు శుభాకాంక్షలు చెప్పారు. ‘‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చూశాను.
ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. నిర్మాణంలో తన తొలి ప్రయత్నంలోనే ఇంత హృద్యంగా, వినోదాత్మకంగా తీసి ప్రేక్షకులని మెప్పిస్తున్న కొణిదెల వారి ఆడబడుచు నిహారికకి, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ టీమ్ అందరికీ నా అభినందనలు. మీరిచ్చిన ఈ స్పూర్తితో తను మరిన్ని జనరంజకమైన చిత్రాలను నిర్మించాలని కోరుకుంటూ.. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే దీనికి ఆరుకోట్ల నిమిషాల వ్యూస్ వచ్చినట్లు జీ5 వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుం ఈ ట్వీట్ తెగ వైరల్ అయిపోయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…