Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి పండుగ సందర్భంగా వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన బుల్లితెర కార్యక్రమాలకు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోని సుమా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి సరికొత్త కార్యక్రమం సుమా అడ్డా అనే కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి సుమ యధావిధిగా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కమెడియన్ వెన్నెల కిషోర్ అలాగే డైరెక్టర్ బాబి కూడా పాల్గొన్నారు.ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి చిరంజీవితో ఒక సెల్ఫీ తీసుకోవడం కోసం అభిమానులు ఎంతో ఆరాటపడుతూ ఉంటారు.
చిరంజీవి కోసం కళ్ళు కాయలు కాసేలా అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. కానీ చిరంజీవి మాత్రం యాంకర్ సుమకు మెసేజ్ చేస్తే తాను మాత్రం చిరంజీవిని అవాయిడ్ చేసినట్టు తెలుస్తుంది. ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా మూడు సంవత్సరాల పాటు సుమకు చిరు మెసేజ్ చేసినప్పటికీ సుమ మాత్రం తన మెసేజ్లను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని తాజాగా చిరంజీవి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు.
ప్రతి సంవత్సరం సుమ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి తనకు హ్యాపీ బర్త్డే అంటూ మూడు సంవత్సరాలు పాటు మెసేజ్ చేశారని, అయితే సుమ మాత్రం తన మెసేజ్ కు ఎలాంటి రిప్లై ఇవ్వలేదని చిరు తెలిపారు. అయితే ఈ విషయంపై సుమ స్పందిస్తూ…చిరంజీవి గారు తన పుట్టినరోజు తనకు మెసేజ్ చేస్తారని నేను అసలు ఊహించలేదని ఆ నెంబర్ కూడా తాను క్రాస్ చెక్ చేయలేదని తెలిపారు.2022 సంవత్సరంలో చిరంజీవి గారిని కలిసినప్పుడు ఈ విషయం చెప్పగా నేను తనకు క్షమాపణలు చెప్పి తన నెంబర్ తీసుకున్నానని సుమా వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…