Featured

Chiranjeevi: చిరు గొప్పతనాన్ని బయటపెట్టిన గాడ్ ఫాదర్ డైలాగ్ రైటర్ లక్ష్మి భూపాల.. ఏమన్నారంటే?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్. లూసిఫర్ సినిమాకి రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ సెలబ్రెటీలు నటించారు. ఇకపోతే ఈ సినిమా మంచి విజయం కావడంతో ఈ సినిమాకు డైలాగులు రాసిన డైలాగ్ రైటర్ లక్ష్మీ భూపాల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాల నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతోమందికి స్ఫూర్తి, ఆయనని ఎంతోమంది ఆదరిస్తున్నారని తెలిపారు.సాధారణంగా ఎవరు ఎలాంటి పని చేసిన ఆ పనిపై ఇష్టంతో అయినా చేస్తారు లేదంటే ఆకలితో ఆయన చేస్తారు కానీ చిరంజీవి గారు మాత్రం ప్రేమతో ఇష్టంతో చేస్తారని తెలిపారు.

ఇక గాడ్ ఫాదర్ సినిమాకు డైలాగులు రాసిన ఈయన చిరంజీవి గురించి మాట్లాడుతూ నేను రాసిన డైలాగులు మెగాస్టార్ గారికి కనుక నచ్చితే ఆయన సెట్ లో ఉన్న వారందరిని పిలిచే ఆ డైలాగులు వినిపిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో అనుభవం ఉన్నటువంటి చిరంజీవి గారు ఇప్పటికీ ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలని తపన పడుతుంటారని లక్ష్మి భూపాల వెల్లడించారు.

Chiranjeevi: చిరంజీవి ఇష్టం.. ప్రేమతో సినిమా చేస్తారు

ఇక మనం చిరంజీవి గారికి పేజీల కొద్ది డైలాగులు రాసిచ్చిన అవి పర్ఫెక్ట్ గా వచ్చేవరకు ఆయన ప్యాకప్ చెప్పరని చాలామంది డబ్బింగ్ దగ్గర అడ్జస్ట్ చేసుకోవచ్చని భావిస్తారు. కానీ చిరంజీవి గారి దగ్గర అలాంటివి కుదరవని తెలిపారు. డైలాగ్ పూర్తి అయిన తర్వాత తనని అడుగుతారని పర్వాలేదు సార్ అని చెప్పినా కూడా వన్ మోర్ అంటూ ఆ డైలాగ్ పర్ఫెక్ట్ గా వచ్చేవరకు ఆయన కృషి చేస్తారని ఇలా పనిపై ఉన్న పట్టుదలే ఆయనని గత కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగేలా చేస్తుందని ఈ సందర్భంగా లక్ష్మి భూపాల మెగాస్టార్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago