Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే గాడ్ ఫాదర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి ఇక తన తదుపరి సినిమాలతో బిజీకానున్నారు. ఈ క్రమంలోనే తన తర్వాత చిత్రాన్ని మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నట్లు ఇదివరకు ప్రకటించారు. ఈ సినిమా కూడా 40% షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఇక మెగాస్టార్ తన 154 వ సినిమాని డైరెక్టర్ బాబి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ వినిపించింది. దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ మాత్రమే కాకుండా ఒక వీడియోని కూడా విడుదల చేయడంతో పెద్ద ఎత్తున ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముందు నుంచి అనుకున్న విధంగానే ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ అనౌన్స్ చేశారు. అదేవిధంగా ఈ సినిమా నుంచి ఒక వీడియో విడుదల కావడంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సాధారణంగా మెగాస్టార్ చిరంజీవికి స్మోకింగ్ చేసే అలవాటు లేదు కొన్ని సినిమాలలో కథ డిమాండ్ చేసినప్పుడు ఈయన కేవలం మిల్క్ మేడ్ సిగరెట్లు మాత్రమే తాగారు.
కానీ వాల్తేరు వీరయ్య సినిమా విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఇష్టం లేనటువంటి పనిని డైరెక్టర్ బాబి చిరంజీవి చేత చేయించారంటూ పెద్ద ఎత్తున మెగా అభిమానులు డైరెక్టర్ బాబీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సినిమా టీజర్ లో చిరంజీవి మాస్ లుక్ లో కనిపించడమే కాకుండా భారీగా స్మోక్ చేస్తున్నారు. ఇలా పెద్ద ఎత్తున స్మోక్ చేయడంతో చిరంజీవి గారికి ఇష్టం లేనటువంటి పనిని డైరెక్టర్ చేయించారన్న ఉద్దేశంతో అభిమానులు డైరెక్టర్ పై మండిపడుతున్నారు.
టాలీవుడ్‌లో మరో స్టార్ పెళ్లి సందడి మొదలైంది. నటుడు Vijay Deverakonda ఇంటి వద్ద పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమైనట్టు సమాచారం.…
శీతాకాలం వచ్చిందంటే వీధి మూలల్లో వేడి వేడి పల్లీలు అమ్మే దృశ్యాలు సాధారణం. వేరుశనగలు చాలామందికి ఇష్టమైన స్నాక్. తక్కువ…
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే పండ్లలో అరటిపండు ముందంజలో ఉంటుంది. తక్కువ ధరలో లభించడం, తేలికగా జీర్ణమవడం, తక్షణ శక్తిని అందించడం…
ఓ వైభవంగా సాగుతున్న వివాహ వేడుక ఒక్కసారిగా కలకలం రేపింది. బంధుమిత్రులతో కిక్కిరిసిన రిసెప్షన్ కార్యక్రమంలో, అతిథిలా హాజరైన ఓ…
అదనపు మార్జిన్ ఇక అవసరం లేదు ఇప్పటివరకు బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై 3 శాతం, వెండి కాంట్రాక్టులపై 7 శాతం…
బిలియనీర్ల డైట్ సీక్రెట్స్.. జంక్ ఫుడ్, హెల్తీ ఆహారం మిశ్రితం ప్రతి జీవికి ఆహారం అవసరం. అది సరైన పద్ధతిలో…