Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని అనంతరం రాజకీయాలలోకి వెళ్లారు. అయితే రాజకీయాలలో ఈయన కొనసాగలేక తిరిగి సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ విధంగా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈయన ఇంటర్వ్యూలలో పాల్గొనగా ఈయనకు రాజకీయ ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి.
ఇక మెగా కుటుంబం నుంచి ముగ్గురు సోదరులు కూడా రాజకీయాలలో ఉన్న విషయం మనకు తెలిసిందే అయితే ప్రస్తుతం చిరంజీవి మాత్రం రాజకీయాల గురించి పట్టించుకోకుండా సినిమాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఈయన తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించలేదని పరోక్షంగా ఈయన మాటలు బట్టి చూస్తే అర్థమవుతుంది.
పవన్ కళ్యాణ్ ఏపీకి రాజధానిగా అమరావతి కావాలని చూస్తే ఈయన మాత్రం తాను వైజాగ్ వాసినీ అవుతానని చెప్పడంతో ఈయనకు అమరావతి రాజధానిగా ఇష్టం లేదని మూడు రాజధానులకే సపోర్ట్ చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు.అయితే ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి చిరంజీవి పవన్ కళ్యాణ్ వైసీపీతో పోరాటం చేయడం తనకు ఏమాత్రం సంబంధం లేదని అది పూర్తిగా తన రాజకీయ జీవితం అని తెలిపారు.
ఇక తాను వైజాగ్ లో ఇల్లు కట్టుకుంటున్నాను అంటే తనకు ఎప్పటినుంచో ఆ కోరిక ఉందని కేవలం వైజాగ్ లోనే కాకుండా గోవాలో ఊటీలో కూడా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను. ఇక వైజాగ్ లో ఇల్లు కట్టుకోవడానికి స్థలం కూడా కొన్నది వాస్తవమేనని తెలియజేశారు. వైజాగ్ లో ఇల్లు కట్టుకుంటే అది కూడా రాజకీయం చేయడం తనకు ఆశ్చర్యం వేసిందని తెలిపారు.అయితే తాను మాత్రం రాజకీయాలకు పూర్తిగా దూరమని రాజకీయాలలో తాను ఉండలేనని మరోసారి చిరంజీవి క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…