Movie News

Chiranjeevi: మరోసారి మెగా అల్లు వివాదం పై స్పందించిన చిరు…. చాలా ఇరిటేషన్ గా ఉందంటూ కామెంట్స్!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి చిరంజీవికి మరోసారి మెగా, అల్లు కుటుంబం మధ్య వివాదాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తాను మెగాస్టార్ ప్రోద్బలంతోనే ఆయన అండదండలతోనే ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పిన అల్లు అర్జున్ ఇప్పుడు మాత్రం అల్లు రామలింగయ్య పేరు చెప్పడం గమనార్హం. అలాగే చిరంజీవి ఇచ్చిన స్టైలిష్ స్టార్ అనే బిరుదును పక్కనపెట్టి ఐకాన్ స్టార్ అనే బిరుదును తగిలించుకోవడమేకాకుండా తన అభిమానులను ఉద్దేశిస్తూ తన ఆర్మీ అంటూ ఈయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.

దీంతో అల్లు కుటుంబం మెగా కుటుంబానికి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని అందుకే అల్లు అర్జున్ మెగా కుటుంబం నుంచి పక్కకు వచ్చారనీ కామెంట్లు వచ్చాయి.ఈ క్రమంలోనే వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్లలో భాగంగా చిరంజీవి ఈ విషయంపై స్పందిస్తూ తాను పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ బాగా ఎదగాలని కోరుకుంటాను.

Chiranjeevi: ప్రతిసారి అల్లు అర్జున్ నా పేరు చెప్పాలని లేదు..

వీరితో పాటు అల్లు అర్జున్ ఎదగాలని తను ఎదుగుతున్న చాలా ఆనందపడతానని చిరంజీవి తెలిపారు. ఇక అల్లు అర్జున్ మాట్లాడిన ప్రతిసారి నా పేరును ప్రస్తావించాలని నేను ఎందుకు అనుకుంటాను. ఇలా ప్రతిసారి ఆ పేరును చెప్పలేదని ఎందుకు వివాదాలు సృష్టిస్తారు. ఇలాంటి వివాదాలు విని చాలా ఇరిటేషన్ గా ఉందని ప్రతి ఒక్కరి ఎదుగుదలను తాను ఎంజాయ్ చేస్తాననీ ఈ సందర్భంగా చిరంజీవి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago