Movie News

Chiranjeevi -Puri Jagannadh: గాడ్ ఫాదర్ హిట్.. పూరితో ఇన్‌స్టా లైవ్ లో చిరు.. ఏం మాట్లాడారంటే?

Chiranjeevi -Puri Jagannadh: మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ తర్వాత మొదటిసారి బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించారు. రీఎంట్రీ తర్వాత ఈయన నటించిన సినిమాలలో కెల్లా గాడ్ ఫాదర్ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో పూరి జగన్నాథ్ కూడా ఓ సన్నివేశంలో నటించిన విషయం తెలిసిందే.

గాడ్ ఫాదర్ సినిమా హిట్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి పూరి జగన్నాథ్ తో కలిసి ఇన్‌స్టా లైవ్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరు ఎన్నో విషయాల గురించి చర్చించారు.ఈ కార్యక్రమంలో భాగంగా పూరి జగన్నాథ్ ఎన్నో రకాల ప్రశ్నలు అడగగా చిరంజీవి కూడా సమాధానాలు చెప్పారు. అదే విధంగా వీరిద్దరి మధ్య కొన్ని సరదా సన్నివేశాలు కూడా చోటుచేసుకున్నాయని తెలుస్తుంది.

గాడ్ ఫాదర్ సినిమా హిట్ కావడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేసినటువంటి మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రం వాల్తేరు వీరయ్య గురించి కూడా ఈ సందర్భంగా అప్డేట్ ఇచ్చారు.ఈ రెండు సినిమాల గురించి మాత్రమే కాకుండా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా డిజాస్టర్ గురించి కూడా మరోసారి ప్రస్తావించారు.

అదేవిధంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరంజీవి కోసం రాసిన ఆటో జానీ గురించి కూడా ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోని ఆటో జానీ వద్దులే అన్నయ్య మరో సినిమా కథతో మీ ముందుకు వస్తాను అంటూ పూరి సమాధానం చెప్పారు. అదేవిధంగా లైగర్ డిజాస్టర్ గురించి కూడా పూరి జగన్నాథ్ మాట్లాడారు. ఈ సినిమా కోసం మూడు సంవత్సరాలు కష్టపడ్డాననీ తెలిపారు.

Chiranjeevi -Puri Jagannadh: మూడు సంవత్సరాలు పాటు బాధపడలేము కదా…

మూడు సంవత్సరాల పాటు కష్టపడిన ఈ సినిమా ఫ్లాప్ కావడం బాధ కలిగించింది అయినా ఈ సినిమా కోసం మూడేళ్లు బాధపడలేము కదా అంటూ సినిమా డిజాస్టర్ నుంచి బయటపడిన విధానాన్ని తెలిపారు.ఈ క్రమంలోనే గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో నీతో పాటు షూటింగ్ లోకేషన్ లోకి చార్మి కూడా వచ్చింది కదా కానీ మీరిద్దరు కేరవాన్ లో నుంచి చాలా సేపటి వరకు బయటకు రాలేదు అంటూ మెగాస్టార్ పూరి జగన్నాథ్ ను ఆట పట్టించారు. మొత్తానికి ఈ లైవ్ కి సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago