ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైన అద్భుతం సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రతీ ఒక్కరినీ మెప్పిస్తోంది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో టాప్ లో ట్రెంట్ అవుతోంది. ఈ సినిమా చూసిన వారికి సూపర్ గుడ్ ఫిల్మ్ అనే ఆలోచన వస్తుంది. అయితే దీనిలో తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ హీరో, హీరోయిన్లుగా నటించారు.
మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 19న నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అయింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాను బడా హీరోలు సైతం మెచ్చుకుంటున్నారు. జీవిత రాజశేఖర్ కుమార్తెకు ఈ సినిమాలో మంచి మార్కులు పడ్డాయి. ఆమె నటనకు ఫిదా అయిపోయారు. ఇక ఈ సినిమాలో.. ఒకే ఫోన్ నంబర్ ను ఇద్దరు వ్యక్తులకు ఇస్తే..ఏం జరుగుతుంది.
ఆ నంబర్ ను కూడా హీరో, హీరోయిన్ల వద్దనే ఉంటాయి. ఇక వాళ్ల మధ్య ఎలా ప్రేమ మొదలవుతుంది.. అస్సలు అలా ఒకే నంబర్ ను ఇద్దరికి ఎలా ఇస్తారు.. ఇవన్నీ చక్కగా వివరించి.. సినిమాలో చూపించారు. తజాగా ఈ చిత్రం గురించి మెగస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ తాను నిన్న రాత్రి సినిమా చూశానని.. ఇది ఒక న్యూ ఎంగేజింగ్ నోవెల్ సినిమా అని ట్వీట్ చేశారు… ఇంకా తేజ సజ్జా, శివానీల నటన చాలా ఇంప్రెసివ్‌గా ఉందన్నారు’’.
మూవీ చిత్ర సభ్యులకు కంగ్రాట్స్ చెప్పారు. ఇక తేజ సజ్జల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి కథలను ఎంచుకుంటూ.. హీరోగా దూసుకుపోతున్నాడు. బాలనటుడిగా అతడికి మంచి పేరు ఉంది. ఇంద్ర సినిమాలో అయితే చిరంజీవి బాల్యంలో ఉన్న క్యారెక్టర్ ను పోషించాడు. ఇక మెగాస్టార్ చేసిన ట్వీట్ కు తేజ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…