Movie News

Chiranjeevi: చిరంజీవి సినీ కెరియర్ లో కొన్ని కారణాలవల్ల ఆగిపోయిన సినిమాలివే?

Chiranjeevi:టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేడు పుట్టినరోజు జరుపుకోవడంతో పెద్ద ఎత్తున అభిమానులు సెలబ్రిటీలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.పుట్టినరోజు కావడంతో ఈయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేయడమే కాకుండా ఎంతోమంది మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు సంబంధించిన ఎన్నో విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఈయన కూడా కొన్ని కారణాలవల్ల కమిట్ అయి సినిమాలను వదులుకున్నారు. మరి ఆ సినిమాలేంటో ఓ లుకేద్దాం…

వినాలని ఉంది: రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో చిరంజీవి, టబు, ఊర్మిళ హీరో హీరోయిన్లుగా ప్రారంభమైన ఈ సినిమా కొంత షూటింగ్ జరుపుకొని మధ్యలోనే ఆగిపోయింది.

అబూ బాగ్ధాద్ గజదొంగ:  సురేష్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ‘అబూ బాగ్దాద్ గజదొంగ’ సినిమా భారీ బడ్జెట్ తో చేయాలని భావించారు. అయితే ఈ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది.

వజ్రాల దొంగ: కోదండరామిరెడ్డి దర్శకత్వంలో శ్రీదేవి చిరంజీవి జంటగా ప్రారంభమైన ఈ సినిమా చేయాలని అనుకున్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఇది కూడా ఆగిపోయింది.

ఇద్దరు పెళ్ళాల కథ:కోదండరామిరెడ్డి దర్శకత్వంలోనే చిరంజీవి హీరోగా ఈ సినిమా చేయాలని అనుకున్నారు అయితే స్క్రిప్ట్ ఫైనల్ కాకపోవడంతో ఈ సినిమా పక్కకు తప్పుకుంది.

వీఎన్ ఆదిత్య: మనసంతా నువ్వేనేనున్నాను వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు విఎన్ ఆదిత్య మెగాస్టార్ సినిమా చేయాలనుకున్నారు అయితే కథ ఫైనల్ కాకపోవడంతో ఈ సినిమా క్యాన్సిల్ అయింది.

భూలోక వీరుడు: భైరవద్వీపం ఆదిత్య 369 వంటి సినిమాలు చేసిన సింగీతం శ్రీనివాస్ చిరంజీవితో భూలోక వీరుడు తీయాలనుకున్నారు. సినిమా మొదలు పెట్టిన తర్వాత ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోయింది.

 

ఆంధ్రావాలా: పూరి ఎన్టీఆర్ కాంబినేషన్లు వచ్చిన ఈ సినిమా ముందుగా చిరంజీవికే అవకాశం ఇచ్చారు. అయితే మెగాస్టార్ ఈ సినిమాని కొన్ని కారణాలవల్ల వద్దన్నారు.

Chiranjeevi: రీ ఎంట్రీ పూరితో ప్లాన్ చేసిన మెగాస్టార్…

ఆటో జానీ: చిరంజీవి 150 సినిమాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆటో జానీ సినిమా చేయాలని భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఈ సినిమాలతో పాటు శాంతినివాసం, వడ్డీ కాసుల వాడు, వంటి పలు సినిమాలు కూడా చిరంజీవి మధ్యలోనే వదులుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago