వెండితెరపై చిరంజీవి – విజయశాంతి జోడీకి మంచి క్రేజ్ ఉంది. వీళ్లిద్దరి కలయికలో ఇప్పటి వరకు 15కు పైగా చిత్రాలు రాగా మూడు నాలుగు చిత్రాలు మినహా మిగతావన్నీ బాక్సాఫీస్ వద్ద చక్కటి విజయాల్ని అందుకున్నాయి. ఇక వీళ్లిద్దరూ ఆఖరిగా 1993లో వచ్చిన ‘మెకానిక్ అల్లుడు’ చిత్రంలో నటించాక మళ్లీ తెరపై ఒకటిగా సందడి చేసింది లేదు. కానీ, ఇప్పుడు దాదాపు 27ఏళ్ల తర్వాత ఈ ఇద్దరినీ తెరపై దర్శించుకునే అవకాశం రాబోతుందని సమాచారం.
ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయిన వెంటనే ఆయన ‘లూసీఫర్’ రీమేక్‌లో నటించడం ఇప్పటికే ఖాయమైంది. యువ దర్శకుడు సుజీత్ దీన్ని తెరకెక్కించనున్నారు. ఇప్పటకే స్ర్కిప్ట్ పనులు ప్రారంభమైపోయాయి. ఇప్పుడీ చిత్రంలోనే విజయశాంతికి ఓ కీలక పాత్ర ఉందని తెలుస్తోంది. నిజానికి ఈ పాత్రపై నెట్టింట రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. జెనీలియా, టబు, త్రిష తదితరుల పేర్లు ఈ పాత్రకు పరిశీలిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కానీ, తాజాగా చిత్ర వర్గాల్లో వినిపిస్తున్న చర్చల ప్రకారం దీన్ని విజయశాంతి కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దుతోన్నట్లు తెలుస్తోంది. మరి దీంట్లో వాస్తవమెంత? అసలా పాత్ర ఏంటి? ఎలా ఉండబోతుంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.????
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…