Featured

Choreographer Suchitra Chandhra Bose : సుచిత్ర చంద్రబోస్ లవ్ స్టోరీ… పెళ్లయ్యాక చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా…చాలా బాధపడ్డా… ఎన్ని ఆస్తులు సంపాదించామంటే…: కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్

Choreographer Suchithra Chandhra bose: డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఎన్నో సినిమాలకు పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి సుచిత్ర చంద్రబోస్. చెన్నై లో పుట్టిపెరిగిన సుచిత్ర డాన్స్ నేర్చుకుని మొదట రఘు మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసారు. ఇక అంతకంటే ముందు ఇంట్లోవాళ్లకు తెలియకుండా గ్రూప్ డాన్సర్ గా కూడా పనిచేసి ఆ తరువాత టాలెంట్ తో డాన్స్ మాస్టర్ గా ఎదిగిన సుచిత్ర గారు పాటల రచయిత చంద్రబోస్ గారిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. పెళ్లి తరువాత కూడా కెరీర్ ను కొనసాగించిన సుచిత్ర గారు తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్ కి సంబంధిచిన విషయాలను పంచుకున్నారు.

పెళ్ళయ్యాక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా….

సుచిత్ర కొబ్బరి బోండం సినిమాతో కొరియోగ్రాఫర్ గా అడిగిపెట్టి ఆ తరువాత పలు వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ఇక పెళ్లి పీటలు సినిమాకు సింగల్ కార్డు కొరియోగ్రాఫర్ గా ఉన్న సుచిత్ర గారు అప్పటికే చంద్రబోస్ గారు తెలిసినా..పరిచయం, మాటలు మాత్రం పెళ్లిపీటలు సినిమా సమయంలోనే అంటూ చెప్పారు. ఆ సినిమా వేడుకలో సుచిత్ర గారిని చూస్తూ చంద్రబోస్ గారు పాటపడటం తో ఆమెకు అనుమానం వచ్చి పిలిచి ఏంటి ఇదంతా అని అడిగిగా చంద్ర బోస్ గారు పెళ్లిచేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పారట. ఇక సుచిత్ర గారు అయితే మా ఇంట్లో, మీ ఇంట్లో అడిగి వాళ్ళు ఒప్పుకున్నాక నన్ను వచ్చి కలవండి అని చెప్పగా అందరిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు చంద్రబోస్ గారు.

అయితే పెళ్ళయ్యాక కొరియోగ్రాఫర్ కావడం వల్ల ఆఫర్స్ తగ్గిపోవడం ఒక్క అవకాశం లేకపోవడంతో బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను అంటూ సుచిత్ర గారు తెలిపారు. ప్రెగ్నెన్సీ సమయంలో తమిళ్ నుండి ఆఫర్ రావడంతో వాళ్లకు ప్రెగ్నెంట్ అన్న విషయం దాచి సూర్య, జ్యోతిక సినిమాకు డాన్స్ కంపోజ్ చేసారు సుచిత్ర . ఆ తరువాత మళ్ళీ వరుస అవకాశలు వచ్చాయంటూ మర్చిపోలేని సంఘటన అంటే అవన్ ఇవన్ సినిమాకు తమిళ్ లో అవార్డు తాను డాన్స్ నేర్చుకున్న రఘు మాస్టర్ చేతుల మీదుగా తీసుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది అంటూ చెప్పారు. సంపాదించిన దాని గురించి మాట్లాడుతూ కొడుకు విదేశాల్లో చదువుతున్నాడు ఇక కూతురు ఇంటర్ చదువుతోంది అంటూ చెప్పారు. చాలా హ్యాపీగా ఉండే స్వీటీ హోమ్ మాది అదే నేను చంద్రబోస్ సంపాదించుకున్నది అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago