Political News

అంతర్వేది నుంచి తిరుమల వరకు.. గత పాలనపై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు.. ఇవన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఆలయాలు, హిందూ ధర్మానికి సంబంధించిన అంశాలు ప్రధాన చర్చగా మారాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న పలు ఘటనలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పార్టీ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. దేవాలయాల భద్రత, భక్తుల మనోభావాల విషయంలో అప్పటి పాలన నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. ఈ అంశాలను పాయింట్ల వారీగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని కూటమి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అంతర్వేది ఘటనను చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించారు. వైసీపీ పాలనలో అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రథం దగ్ధమైన సంఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటనపై సమగ్ర విచారణ జరగలేదని, సీబీఐకి అప్పగిస్తామని చెప్పి చివరకు తప్పించుకున్నారని ఆయన ఆరోపించారు. రథం దగ్ధానికి తేనెతుట్టె కారణమంటూ అప్పట్లో ఇచ్చిన వివరణ ప్రజలను సంతృప్తిపరచలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అనంతపురం జిల్లాలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం ఘటనను కూడా ఆయన గుర్తు చేశారు. విగ్రహం పగలగొట్టినప్పుడు తీవ్ర ఆవేదన వ్యక్తమైతే, అప్పటి వైసీపీ నాయకులు తేలిగ్గా స్పందించారని విమర్శించారు. “అది బొమ్మే” అన్న తరహా వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను గాయపరిచాయని ఆయన అన్నారు. ఈ అంశాన్ని కూడా ప్రజల్లో చర్చకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.

విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహ శిరఛ్ఛేదం ఘటనను కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ఆ సంఘటనపై అప్పట్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగినా, పాలకులు విషయాన్ని సరిగా తేల్చలేదన్న విమర్శలు ఉన్నాయి. కొత్త విగ్రహం ప్రతిష్ఠతో వ్యవహారాన్ని ముగించారని, అసలు బాధ్యులపై చర్యలు కనిపించలేదని ఆయన ఆరోపించారు.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయ రథంలోని వెండి సింహాల దొంగతనంపై కూడా చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఈ ఘటనపై సరైన దర్యాప్తు జరగలేదని, తూతూ మంత్రంగా విచారణ పూర్తిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాన్ని కూడా ప్రజల్లో ఎండగట్టాలని కూటమి భావిస్తోంది.

అత్యంత సున్నితమైన అంశంగా తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారాన్ని చంద్రబాబు లేవనెత్తారు. 2022లోనే ఈ విషయంపై నివేదిక అందినప్పటికీ, అప్పటి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఈ అంశాలపై వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

telugudesk

Recent Posts

మలయాళంపై వ్యాఖ్యల వివాదం..ట్రోల్స్‌కు సమాధానం ఇచ్చిన సాయి పల్లవి..

నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…

26 minutes ago

68 ఏళ్ల వయసులో పరీక్షలు.. నేషనల్ అవార్డు విన్నర్ స్ఫూర్తి

చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…

34 minutes ago

హైదరాబాద్ వదిలి ముంబైకి బన్నీ..? చివరకు క్లారిటీ ఇచ్చిన తండ్రి..

ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ను వదిలి…

38 minutes ago

మొన్న కులం చెప్పి వార్తల్లో.. ఇవాళ “కులం వద్దు” అంటూ వైరల్..

తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…

2 hours ago

డైరెక్టర్ మాట వినక తప్పలేదు.. ఆ సీన్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చాను.. హీరోయిన్ కామెంట్స్

సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…

2 hours ago

బాబు మోహన్‌తో చేస్తావా అంటే.. సౌందర్య చెప్పిన మాటే షాక్!

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…

3 hours ago