చంద్రబాబు గజదొంగ ! టీడీపీ – జనసేన పొత్తుపై సీఎం వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు !

టీడీపీ-జనసేన పొత్తుపై సీఎం వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ ములాఖత్ లో మిలాఖత్ లు చేసుకున్నారంటూ మండి పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో వైఎస్సార్‌ కాపు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌.. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,57,844 మందికి రూ.536.77 కోట్ల ఆర్థిక సాయం చేశారు. వైఎస్ఆర్ కాపు నేస్తం నిధులను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు సీఎం జగన్‌.

చంద్రబాబు అరెస్ట్ పై మాట్లాడుతూ..

ఆపై అవినీతి కేసులో అరెస్టైన మహానుభావుడి గురించి నాలుగు మాటలు చెబుతా అంటూ మొదలు పెట్టిన ఆయన.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయిడుని ఉద్దేశించి.. “ఇన్ని దొంగ తనాలు చేసినా, ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబును రక్షించుకునేందుకు దొంగలా ముఠా ఉంది.. కానీ, చట్టం ఎవరికైనా ఒక్కటే.. సామాన్యుడికి ఎలాంటి శిక్ష పడుతుందో రాజకీయ నాయకులకు అదే వర్తిస్తుంది అని చెప్పేవాళ్లు చంద్రబాబుకు లేరు. ఆడియో, వీడియో టేపుల్లో చంద్రబాబు దొంగగా అడ్డంగా దొరికినా కూడా.. దోపిడీ సొమ్ము అని ప్రజలకు అర్థం అయినా కూడా బాబు చేసింది నేరమే కాదని వాదించే వాళ్లు సిద్ధం అయ్యారు.. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ఏ ఒక్కరూ రెడీగా లేరు.. చంద్రబాబు దోచిన దాంట్లో వాటదారులు కాబట్టే” అంటూ ఎద్దేవ సీఎం జగన్.

జనసేన, టీడీపీ పొత్తుపై స్పందిస్తూ..

మరో వైపు జనసేన, టీడీపీ పొత్తుపై స్పందిస్తూ.. సాక్ష్యాలు, ఆధారాలు చూసి కోర్టు రిమాండ్ కు పంపినా ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు.. చంద్రబాబు చేసిన తప్పులు ప్రశ్నించకుండా నేరుగా జైలుకు వెళ్లి ములాఖత్‌లో మిలాఖత్ చేసుకుని పొత్తు పెట్టుకుంటారు.. వారి గురించి ప్రజలు ఆలోచించాలి అంటూ జనసేన, టీడీపీ పొత్తుపై వ్యాఖ్యానించారు సీఎం వైఎస్‌ జగన్‌

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago